రోడ్ల అభివృద్ధిపై సమీక్ష | - | Sakshi
Sakshi News home page

రోడ్ల అభివృద్ధిపై సమీక్ష

Jun 7 2026 12:09 AM | Updated on Jun 7 2026 12:09 AM

గోదావరిఖని: రామగుండం నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధి, ఆధునికీకరణ, మెరుగైన రవాణా సౌకర్యం కల్పన లక్ష్యంగా ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ శనివారం హైదరాబాద్‌ ఎర్రమంజిల్‌లోని రోడ్లు, భవనాల శాఖ ప్రధాన కార్యాలయంలో సమీక్షించారు. ఆర్‌ అండ్‌ బీ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌(ఈఎన్‌సీ) మోహన్‌నాయక్‌ అధ్యక్ష తవహించారు. రామగుండంలో కొనసాగుతున్న రోడ్ల అభివృద్ధి, ప్రతిపాదిత రహదారుల నిర్మాణం, మరమ్మతు, విస్తరణకు నిధుల కేటాయింపుపై చర్చించారు. ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ మాట్లాడుతూ, మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు.

పెరిగిన ఎరువుల ధరలు

పెరిగిన ధరల వివరాలు(రూ.లలో)

ఎరువు ప్రస్తుత ధర కొత్త ధర

కాంప్లెక్స్‌ 1,900 2,450

ఎంవోపీ 1,850 1,975

ఎస్‌ఎస్‌పీ 615 1,000

పెద్దపల్లి: వర్షాకాలం ప్రారంభానికి ముందే ఎరువుల ధరలు భారీగా పెరిగాయి. ఇది తమకు ఆర్థికంగా భారమేనని రైతులు ఆందోళన చెందుతున్నారు. యాసంగిలో అధిక దిగుబడి రావడంతో ఉత్సాహంగా ఉన్న అన్నదాతలు.. వానాకాలంలో వరి, పత్తి, మొక్కజొన్న పండించేందుకు సిద్ధమయ్యారు. కానీ, పెరిగిన ఎరువుల ధరలతో అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. పశ్చిమాసియాలొ నెలకొన్న యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడిపదార్థాల ధరలు పెరుగుదల ఎరువులపై పడిందని అంటున్నారు. ఒక్కో బ్యాగుపై రూ.125 నుంచి రూ.500 వరకు పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. తద్వారా జిల్లా రైతులపై ఈ ఒక్క సీజన్‌లోనే సుమారు రూ.100 కోట్ల వరకు భారం పడుతుందని అంటున్నారు. యూరియా, డీఏపీ ధరలను పెంచకపోవడం అన్నదాతలకు కాస్త ఊరటనిచ్చే విషయం.

జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాలి

ముత్తారం: జీవవైధ్య పరిరక్షణతో భవితరాలకు ఆరోగ్యమైన పర్యవరణం అందుతుందని మంథని అటవీశాఖ రేంజర్‌ వినయ్‌నాయక్‌ అన్నారు. పారుపల్లి పెద్దచెరువు వద్ద శనివారం నిర్వహించిన బర్డ్‌ వాక్స్‌, వైల్డ్‌లైఫ్‌ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. పక్షుల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకమన్నారు. వన్యప్రాణులు, పక్షులు, జీవవైధ్యం ప్రాధన్యతపై స్థానికులకు అవగాహన కల్పించాలని బీట్‌ అధికారులకు సూచించారు. సర్పంచ్‌ చోప్పరి సంపత్‌, డిప్యూటీ రేంజర్‌ తిరుపతి, బేగంపేట సెక్షన్‌ ఆఫీసర్‌ నహిదా, రహమ్‌తుల్లా, అమీరుద్దీన్‌, బీట్‌ అధికారులు మేఘరాజ్‌, రాంసింగ్‌, మాధురి, రంజిత, బయాలజిస్ట్‌ చంద్రకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

స్వచ్ఛ పెద్దపల్లికి సహకరించాలి

పెద్దపల్లిరూరల్‌: పట్టణంలో స్వచ్ఛత, పరిశుభ్రత పాటించి స్వచ్ఛ పెద్దపల్లిగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని మున్సిపల్‌ చైర్మన్‌ నూగిల్ల మల్లయ్య కోరారు. జిల్లా కేంద్రంలోని భూంనగర్‌కాలనీలో శనివారం ఆయన పర్యటించారు. కాలనీ సమస్యల గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీలు లేక నీరు నిలిచే ప్రాంతాల్లో అత్యవసరంగా కచ్చాకాలువ నిర్మించేలా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. కొత్తగా ఇంటి నిర్మాణం చేసేవారు తప్పనిసరిగా సెట్‌బ్యాక్‌ నిబంధనలు పాటించాలని సూచించారు. వార్డు ఆఫీసర్‌ అశ్విత, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ రామ్మోహన్‌రెడ్డి, ప్రతినిధులు జయరాజ్‌, శంకర్‌, భూమేశ్‌, నరేశ్‌, సంపత్‌ ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement