పోలీసులపై నమ్మకం పెంచాలి | - | Sakshi
Sakshi News home page

పోలీసులపై నమ్మకం పెంచాలి

Jun 7 2026 12:09 AM | Updated on Jun 7 2026 12:09 AM

కోర్టు కానిస్టేబుళ్లను సన్మానిస్తున్న సీపీ, అధికారులు

శ్రీలతను సన్మానిస్తున్న సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా

గోదావరిఖని: బాధితులకు తరఫున ఉంటూ నేరస్తులకు శిక్షపడేలా కృషిచేసి పోలీస్‌ వ్యవస్థపై ప్రజ ల్లో నమ్మకం, విశ్వాసం పెంపొందించాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా సూ చించారు. సీపీ కార్యాలయంలో శనివారం కోర్టు లై జనింగ్‌ పోలీస్‌ అధికారులతో నేరాలు, కేసులు, శిక్షలపై సమీక్షించారు. అనంతరం పలు కేసుల్లో నేరాలు రుజువు చేయడంలో కీలకపాత్ర పోషించిన కోర్టు డ్యూటీ సిబ్బంది, లైజనింగ్‌ అధికారులను సీపీ శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీ(అడ్మిన్‌) శ్రీనివాస్‌, వర్టికల్‌ ఇన్‌చార్జి సీఐ చంద్రశేఖర్‌గౌడ్‌, సీసీఆర్‌బీ సీఐ అనిల్‌కుమార్‌, బాబురావు, ఎస్‌ఐ వినీత తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఆలిండియా పోలీస్‌ స్పోర్ట్స్‌ మీట్‌ యోగాలో ప్రతిభ చూపిన కానిస్టేబుల్‌ శ్రీలతను సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా సన్మానించారు. గోదావరిఖని ఏసీపీ రమేశ్‌, కమాన్‌పూర్‌ ఎస్‌ఐ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

మత్తు పదార్థాలను నిర్మూలిస్తాం

మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రత్యే క బృందాలను ఏర్పాటు చేస్తున్న రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా తెలిపారు. తన చాంబర్‌లో పాత్రికేయులతో కాసేపు మాట్లాడారు. సీఐ ఆధ్వర్యంలో ఇప్పటికే రెండు యాంటీ నార్కోటిక్‌ బృందాలు పనిచేస్తుండగా, వాటికి అదనంగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మత్తు పదార్థాల గురించి తెలిస్తే వెంటనే 87126 56597 నంబరుకు సమాచారం అందించాలని కోరారు. కాగా, కేసీఆర్‌ కాలనీలో శనివారం రాత్రి సీపీ ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు చేశారు. పోలీస్‌ అధికారులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement