గోదావరిఖని: అంతర్జాతీయ రెస్క్యూ పోటీల్లో స త్తా చాటిన సింగరేణి రెస్క్యూని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శనివారం అభినందించారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో సీఎండీ బుద్ధ ప్రకాశ్ జ్యోతి, డైరెక్టర్ వెంకటేశ్వర్లు, రెస్క్యూ జీఎం శ్రీనివాస్‌రెడ్డి, జీఎం (కో ఆర్డినేషన్) శ్రీనివాస్, రెస్క్యూ సూపరింటెండెంట్ రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
నేడు కోల్‌బెల్ట్‌కు హరీశ్‌రావు
గోదావరిఖని: టీబీజీకేఎస్ నిర్వహించ నున్న సింగరేణి పరిరక్షణ సదస్సుకు మాజీమంత్రి హరీశ్‌రావు ఆదివారం కోల్‌బెల్ట్ ప్రాంతానికి రానున్నారు. ఎన్టీపీసీలోని శ్రీమయి కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించే సదస్సుకు హాజరవుతారు. యూనియన్ గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్, అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డితోపాటు పెద్దసంఖ్యలో యూనియన్ శ్రేణులు హాజరుకానున్నారు.


