పెద్దపల్లి: రైతులు ఇబ్బందులు పడితే సొమ్ము చేసుకోవాలని ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని ప్రభు త్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు విమర్శించారు. సుల్తానాబాద్ ఆర్యవై శ్య భవన్‌లో బుధవారం 2, 3, 4, 5 వార్డుల గ్రామసభలు నిర్వహించారు. విప్ మాట్లాడుతూ, రైతులకు మేలు జరిగితే ఓర్వలేక పోతున్నారన్నారు. గ తంలో బస్తాకు 10 కిలోల చొప్పున ధాన్యం కోతలు పెట్టి ముంచిన బీఆర్‌ఎస్ నేతలు.. ఇప్పుడు రైతులపై మొసలికన్నీరు కార్చుతున్నారని దుయ్యబట్టారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు 98శాతం ధాన్యం కొనుగోలు పూర్తిచేసినట్టు చెప్పారు. పంట మార్పిడి పద్ధతి పాటిస్తే భూసారం పెరుగుతుందని అన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులపై అప్ర మత్తంగా ఉండాలని కోరారు. మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశ్‌రావు, సింగిల్‌విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ రమేశ్, డీఏవో శ్రీనివాస్, తహసిల్దార్ బషీరోద్దీన్ పాల్గొన్నారు.
ప్రభుత్వ విప్ విజయరమణారావు


