సుల్తానాబాద్‌రూరల్: కాషాయ జెండా కోసం కలిసి పనిచేద్దామని ఎమ్మెల్సీ మల్క కొము ర య్య అన్నారు. నర్సయ్యపల్లి గ్రామంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న ప్రశిక్షణ కార్యక్రమానికి గురువారం ఎమ్మెల్సీ మల్క కొముర య్య హాజరై మాట్లాడారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని, దానికి అనుగుణంగా కార్యకర్తలు, నాయకులు సైనికుల్లా పనిచేయా లని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయ కులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
నిబంధనలు పాటించాలి
పెద్దపల్లిరూరల్: డ్రైవర్లు రోడ్డు భద్రత నియ మావళిపై అవగాహన పెంచుకోవాలని ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్ సూచించారు. జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో ఆటో, కారు, డీసీఎం త దితర వాహన డ్రైవర్లకు గురువారం అవగాహన కల్పించారు. పోలీసుశాఖ ఇప్పటికే అరైవ్..అలైవ్ ద్వారా అనేక కార్యక్రమాలను నిర్వహించిందని ఆయన తెలిపారు. మద్యం తాగి వాహనాలను నడపొద్దని, అతివేగం, నిర్లక్ష్యపు డ్రై వింగ్‌తోనే అనేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. కుటుంబసభ్యుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని నిబంధనలకు లో బడి డ్రైవింగ్ చేయాలని సూచించారు. ఈ కా ర్యక్రమంలో ఎస్‌ఐ రవీందర్, ఏఎస్‌ఐ రవి, వేణుగోపాల్‌తో పాటు సిబ్బంది శ్రీనివాస్, మ ల్లేశ్, వేణు, వినయ్ తదితరులు పాల్గొన్నారు.
కానిస్టేబుల్‌కు అభినందన
కమాన్‌పూర్(మంథని): కమాన్‌పూర్ పోలీస్ స్టేషన్‌లోని కానిస్టేబుల్ కూరపాటి శ్రీలతను డీజీపీ కార్యాలయంలో గురువారం డీజీపీ సీవీ ఆనంద్, ఐజీ గజారావ్ భూపాల్ అభినందించారు. గతనెల 23 నుంచి 27వ తేదీ వరకు హరియాణ రాష్ట్రంలోని కర్నాల్ వచ్చేర్ స్టేడియంలో నిర్వహించిన మూడో ఆల్ ఇండియా పోలీస్ యోగా పోటీల్లో తెలంగాణ నుంచి ఎంపికై న శ్రీలత అత్యంత ప్రతిభ కనబర్చి కాంస్య పతకం సాధించిన విషయం విదితమే.
9న జాబ్‌మేళా
పెద్దపల్లి: జిల్లాలోని నిరుద్యోగుల కోసం ఈ నెల 9న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి రాజశేఖర్ తెలిపారు. ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో లోన్ ఆఫీసర్, కస్టమర్ రిలేషన్ అసోసియేట్ పోస్టులు భర్తీ చేస్తారని ఆయన పేర్కొన్నారు. ఎంపికైనవారు పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల, హుజూరాబాద్, జనగాం, నల్గొండ, మిర్యాల గూడ, సూర్యాపేట, నర్సంపేట, పరకాల, మహబూబాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్, బోధన్, ఇచ్చోడ, ఆర్మూర్, నిర్మల్ ప్రాంతాల్లో పనిచే యాల్సి ఉంటుందని, 19 నుంచి 25ఏళ్ల మధ్య వయసుగలవారు అర్హులన్నారు. వివరాలకు 89853 36947, 81212 62441 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.
రెస్క్యూ రికవరీలో ప్రాఽథమిక శిక్షణ
గోదావరిఖని: రెస్క్యూ రికవరీలో ప్రాథమిక శి క్షణ కోసం భూగర్భగనుల్లో పనిచేస్తున్న కార్మి కుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని రెస్క్యూ జీఎం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. వృత్తిప రమైన భద్రత, పనిపరిస్థితుల ప్రకారం గను ల్లో భద్రతప్రమాణాలు మరింత బలోపేతం చేయడానికి తీసుకున్న పరిపాలన చర్యల్లో భాగంగా రెస్క్యూ శిక్షణ పొందిన సిబ్బంది సంఖ్యను పెంచడానికి నిర్ణయించామని పేర్కొ న్నారు. 21 నుంచి 40ఏళ్ల వయసులోపు ఉండి, కనీసం టెన్ట్ ఉత్తీర్ణత సాధించినవారు అర్హులన్నారు. వీరికి ప్రథమ చికిత్స సర్టిఫికెట్ ఉండాలని, భూగర్భగనిలో పనిచేయాలని సూచించా రు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థి ఎంపిక పరీక్ష, వైద్యపరీక్ష ఉంటుందని వివరించారు. అర్హత సాధించిన కార్మికులకు రామగుండం మెయిన్‌రెస్క్యూ స్టేషన్‌లో రెస్క్యూ రికవరీలో శిక్షణ ఇవ్వనున్న ట్లు వెల్లడించారు. ఈనెల 15లోగా దరఖాస్తు చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు.


