కోల్‌సిటీ/గోదావరిఖనిటౌన్/పాలకుర్తి: అభివృద్ధి, సంక్షేమ పథకాల సమాచారాన్ని నియోజకవర్గ ప్రజలకు చేరవేయాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్‌ఠాకూర్ కోరారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక వార్డుసభలను గోదావరిఖని ఆర్‌సీవోఏ క్లబ్‌లో గురువారం నిర్వహించారు. మేయర్ మ హంకాళి స్వామి అధ్యక్షత వహించారు. అనంతరం 57వ డివిజన్‌లో వార్డు సందర్శన చేపట్టారు. ఆర్టీసీ బస్టాండ్ ఆధునికీకరణ పనులు ప్రారంభించారు. పాలకుర్తి మండలం కొత్తపల్లిలో ఉపాధిహామీ పను లు పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మాట్లాడారు. నగరంలో లోతట్టు ప్రాంతాలు వరద ప్రభావానికి గురికాకుండా మూడు నెలల ముందే కాలువల్లో పూడికతీత ప్రారంభించామని అన్నారు. స్వచ్ఛ రామగుండంగా మార్చేందుకు అందరూ సహకరించాలని ఆయన కోరారు. భూగర్భ జలాల వృద్ధికి ఇంకుడుగుంతలు నిర్మించుకోవాలని సూచించారు. ఓటరు జాబితా సర్‌పై రామగుండం తహసీల్దార్ రవీందర్ అవగాహన కల్పించారు. ఉపాధిహామీ పనులతో పేద కూలీలకు ఆర్థిక భరోసా లభిస్తుందని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే సతీమణి మనాలీ ఠాకూర్, డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ సంపత్, ఏసీపీ శ్రీహరి, డి ప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, టీపీఎస్ నవీన్, ఆర్‌వో ఆంజనేయులు, సూపరింటెండెంట్ శ్రీనివా స్, ఏఈ తేజస్విని, మెడికల్ ఆఫీసర్ అతుల్య నా యర్, మెప్మా టీఎంసీ మౌనిక, కార్పొరేటర్లు ము స్తఫా, చిదురాల నాగరాజు, గట్ల రమేశ్, ధూళికట్ట సతీశ్, మున్సిపల్ ఏఈ మనోజ్, టీపీఎస్ నవీన్, మెప్మా సీవో శమంత, ఆర్టీసీ డీఎం నాగభూషణం, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు బొంతల రాజేశ్, కార్పొరేటర్లు కల్వల పద్మావతి, గడ్డం రమాదేవి, నెలకంటి రాము, తాళ్లపల్లి యుగంధర్, చిదురాల నాగరాజు, చుక్కల లావణ్య, కర్రావుల డేవిడ్ రాజు, కొత్తపల్లి సర్పంచ్ తోట స్వప్న తదితరులు పాల్గొన్నారు.
రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్


