గోదావరిఖని: జిల్లాలో నలుగురు ఎస్‌ఐలను బదిలీ చేస్తూ రామగుండం పోలీస్‌కమిషనర్ అంబర్ కిశోర్ ఝా గురువారం ఉత్తర్వులు జారీచేశారు. జూలపల్లి ఎస్‌హెచ్‌వో సీహెచ్ సనత్‌కుమార్‌ను పొత్కపల్లికి, పెద్దపల్లి ఎస్‌ఐ–2 బుద్దె మల్లేశ్‌ను జూలపల్లి ఎస్‌హెచ్‌వోగా, పెద్దపల్లి సీసీఎస్ ఎస్‌ఐ బి.జీవన్‌ను పెద్దపల్లి పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌వోగా, సుల్తానాబాద్ ఎస్‌ఐ జె.నరేశ్‌ను పెద్దపల్లి రూరల్ ఎస్‌ఐగా బదిలీ చేశారు. ఈమేరకు సీపీ ఆదేశాలు జారీచేశారు.
హరిపురం సమీపంలో ఫ్లైఓవర్
ఓదెల: హరిపురం గ్రామ శివారులోని అండర్‌బ్రిడ్జి ప్రదేశంలో రైల్వేఫ్లై ఓవర్ నిర్మించాలని ఆ గ్రామ సర్పంచ్ గ్యారవేని విజయ కోరారు. ఈమేరకు కలెక్టర్ కోయ శ్రీహర్షకు గురువారం ఒక వినతిపత్రం అందజేశారు. స్పందించిన కలెక్టర్.. ఫ్లైఓవర్ నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని సర్పంచ్ వివరించారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుండేటి ఐలయ్యయాదవ్, నాయకులు తదితరులు ఉన్నారు.
స్వర్ణగిరి టెంపుల్‌కు ఆర్టీసీ బస్సు
మంథని: మంథని నుంచి యాదగిరిగుట్ట, స్వర్ణగిరి పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక టూర్ ప్యాకేజీతో బస్సు నడిపిస్తామని ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రవణ్ కుమార్ గురువారం తెలిపారు. సూపర్ లగ్జరీ బస్సు ఈనెల 7వ తేదీన ఉదయం 6.00 గంటలకు మంథనిలో బయలుదేరుతుందన్నారు. అదేరోజు రాత్రి 10 గంటలకు తిరిగి మంథని చేరుకుంటుందన్నారు. యా దగిరిగుట్ట, స్వర్ణగిరి, భద్రకాళి టెంపుల్, వెయ్యి స్తంభాల గుడి దర్శించుకోవచ్చని తెలిపారు. పెద్దలకు రూ.1,200, పిల్లలకు రూ.900 చార్జి ఉంటుందని, సీటు బుకింగ్‌కు 99486 71514, 99592 25923 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.
సనత్
మల్లేశ్
జీవన్


