మంథని: విద్యార్థులు చిన్నవయసు నుంచే ప్రకృతి పరిరక్షణలో భాగస్వాములు కావా లని పెద్దపల్లి అటవీరేంజ్ ఆఫీసర్ సతీశ్ కుమార్ సూచించారు. ప్రజాపాలన – ప్ర గతి ప్రణాళిక –99 రోజుల కార్యాచరణ ప్ర ణాళికలో భాగంగా జిల్లా అటవీ ఇన్‌చార్జి అధికారి నవీన్‌రెడ్డి, మంథని రేంజ్‌లోని జెడ్పీహెచ్‌ఎస్‌లో అడవుల ప్రాధాన్యంపై గురువారం అవగాహన కల్పించారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో అడవులు కీలకపాత్ర పోషిస్తాయన్నారు. ప్రతీఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణలో అడవుల ప్రాధాన్యం అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నా రు. ఇందులో ప్రతిభ కనబర్చిన వారికి ఆయన బ హుమతులు అందజేశారు. డిప్యూటీ రేంజ్ అధికారి కొమురయ్య, స్ట్రైక్‌ఫోర్స్ ఎఫ్‌ఎస్‌వో రహీమతుల్లా, ఫారెస్ట్ బీట్ అధికారులు శ్రావంతి, ప్రదీప్, సహా య శాస్త్రవేత్త కనకజ్యోతి, ఇంటర్ విద్య జిల్లా నో డల్‌ధికారి కల్పన, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ రమేశ్, ఎన్‌ఎస్‌ఎస్ కో ఆర్డినేటర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
పెద్దపల్లి అటవీ రేంజ్ ఆఫీసర్ సతీశ్ కుమార్


