కాంగ్రెస్‌ నిర్వాకంతో అప్పుల ఊబిలో సింగరేణి | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ నిర్వాకంతో అప్పుల ఊబిలో సింగరేణి

Jun 5 2026 4:47 AM | Updated on Jun 5 2026 4:47 AM

టీబీజీకేఎస్‌ గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్‌

గోదావరిఖని: కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్వాహకంతోనే సింగరేణి అప్పుల ఊబిలో కూరుకపోయిందని టీబీజీకేఎస్‌ గౌరవ అధ్యక్షుడు, మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆరోపించారు. గురువారం స్థానిక యూనియన్‌ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక సింగరేణిలో కుంభకోణాలు మొదలయ్యాయని ధ్వజమెత్తారు. ప్రభుత్వ సంస్థల బకా యిలు రూ.54వేల కోట్లను వెంటనే సింగరేణికి చెల్లించాలని ఆయన డిమాండ్‌చేశారు. ప్రభుత్వ మోసాలపై కార్మికులు, వారి కుటుంబాలకు అవగాహన కల్పించేందుకు మాజీమంత్రి హరీశ్‌రావు ఈనెల 7న గోదావరిఖనికి రానున్నట్లు ఈశ్వర్‌ తెలిపారు. ఎన్‌టీపీసీ శ్రీమయి ఫంక్షన్‌హాల్‌లో జరిగే సదస్సును విజయవంతం చేయాలని ఆయన కోరారు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌, టీబీజీకేఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మాదాసి రామమూర్తి, కేంద్ర కోశాధికారి చెల్పూరి సతీశ్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు నడిపల్లి మురళీధర్‌రావు, బొడ్డు రవీందర్‌, కార్పొరేటర్‌ మేకల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

సుల్తాన్‌పూర్‌ గ్రామ పంచాయతీకి అవార్డు

ఎలిగేడు: సుల్తాన్‌పూర్‌ గ్రామ పంచాయతీ ఉత్తమ పర్యావరణ పనితీరు అవార్డుకు ఎంపికై నట్లు పంచాయతీ కార్యదర్శి శివ గురువారం తెలిపారు. వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణలో విశిష్ట సేవలు అందిస్తున్నందుకు గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేశారని పేర్కొన్నారు. ఈనెల 5న హైదరాబాద్‌లో తె లంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో సర్పంచ్‌ కవ్వంపల్లి బాపయ్య, పంచాయతీ కార్యదర్శి శివకు అవార్డు అందిస్తారని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement