రామగిరి: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. కల్వచర్లకు చెందిన మారుపాక రమేశ్(36) సింగరేని ఆర్జీ–3 ఏరియా ఓసీపీ–1లో ప్రైవేట్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తన వ్యక్తిగత పనుల నిమిత్తం గురువారం పెద్దపల్లికి వెళ్తుండగా కల్వచర్ల హనుమాన్ అలయం వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. తీవ్రగాయాలు కావడంతో స్థానికులు సెంటినరీకాలనీ డిస్పెన్సరీకి తరలించగా చికిత్స పొందుతు మృతి చెందాడు. మృతుడికి భార్య శ్యామల, కుమార్తె హర్షిత, కుమారుడు వైభవ్ ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.


