మీటర్లు గిరగిర | - | Sakshi
Sakshi News home page

మీటర్లు గిరగిర

Jun 1 2026 7:17 AM | Updated on Jun 1 2026 7:17 AM

న్యూస్‌రీల్‌

సోమవారం శ్రీ 1 శ్రీ జూన్‌ శ్రీ 2026

సాక్షి పెద్దపల్లి:

ప్రచండ భానుడు ప్రతాపం ఇంకా చూపిస్తూనే ఉన్నాడు. జిల్లాపై నిప్పుల వర్షం కురిపిస్తూనే ఉన్నాడు. సూరీడి వేడి, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉక్కపోతతో ఇళ్లలో ఉండలేక, బయటకు రాలేక నరకయాతన అనుభవిస్తున్నారు. ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు, ఫ్రిజ్డ్‌లను అధికంగా వినియోగిస్తున్నారు. ఫలితంగా విద్యుత్‌ వినియోగం రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. వినియోగం పెరుగుతున్నా.. అంతరాయం లేకుండా నిరంతరం వి ద్యుత్‌ సరఫరా చేస్తున్నామని ట్రాన్స్‌కో అధికారులు చెబుతున్నారు. ప్రత్యామ్నాయ లైన్లు ఏర్పాటు చేయడం, కొత్త విద్యుత్‌ సబ్‌స్టేషన్లు నిర్మించడం, ఫీడర్ల విభజన, పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంచడం వంటి చర్యలతో కోతలులేని నాణ్యమైన కరెంట్‌ అందిస్తున్నామని వారు వివరిస్తున్నారు.

ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం..

ఎండల తీవ్రతతో ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం ప్రజలు కూలర్లు, ఏసీల వినియోగం పెంచేస్తున్నారు. అలాగే అవసరాకు అనుగుణంగా ప్రతీఇంట్లో విద్యుత్‌ గృపకరణాల వినియోగం పెరిగింది. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వాడకం ఎక్కువ కావడంతో గ్రీడ్‌పై ఒత్తిడి పెరుగుతోంది. అలాగే జిల్లాలో యాసంగి సాగు గతంతో పోల్చితే గణనీయంగా పెరిగింది. చివరి అయకట్టు రైతులు అవసరమైన సాగునీరందక రాత్రిపూట బోర్లు అధికంగా వినియోగిస్తున్నారు. దీంతో కూడా విద్యుత్‌కు డిమాండ్‌ పెరిగింది.

జిల్లాలో గృహజ్యోతి లబ్ధిదారులు

జిల్లావ్యాప్తంగా 3,24,276 కరెంట్‌ కనెక్షన్లు ఉన్నాయి. 2,21,956 గృహ వినియోగదారులుండగా అందులో 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను వినియోగించే 1,39,803 మంది గృహజ్యోతి లబ్ధిదారులున్నారు. వీరందరికీ జీరోబిల్లులు వచ్చేవి. ప్రతీరోజు సగటున 45 డిగ్రీల సెల్సియస్‌కుపైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో విద్యుత్‌ వినియోగం పెరిగింది. 201యూనిట్ల విద్యుత్‌ కాల్చినా రూ.1,200 నుంచి రూ.1,300 వరకు కరెంట్‌ బిల్లు వస్తోంది. ఫిబ్రవరిలో గృహజ్యోతి లబ్ధిదారుల సంఖ్య వీరిలో నుంచి దాదాపు 10 వేల మంది 200 యూనిట్లకు మించి విద్యుత్‌ వినియోగించడంతో అధికారులు బిల్లులు అందజేశారు. వర్షాలకు కురిసి వాతావరణం చల్లబడితే వినియోగం కాస్త తగ్గే అవకాశం లేకపోలేదు. వినియోగాన్ని నియంత్రించేందుకు ప్రతీఇంట్లోనూ ఎల్‌ఈడీ బల్బులు వాడాలని అధికారులు సూచిస్తున్నారు. అవసరం లేనప్పుడు ఫ్యాన్లు, ఏసీలు, టీవీలు ఆఫ్‌ చేయడం, రాత్రి సమయంలో వినియోగం తగ్గించాలని సూచిస్తున్నారు. అన్నదాతలు తమ వ్యవసాయ పంపుసెట్లను ఉదయం లేదా మధ్యాహ్నం వినియోగించుకోవాలని అధికారులు చెబుతున్నారు.

తేదీ గతేడాది ప్రస్తుతం

23 2.97 3.09

24 2.82 3.16

25 2.89 3.12

26 3.13 3.02

27 2.78 .060

28 2.8 3.09

29 2.98 3.08

ఎండల తీవ్రతతో పెరిగిన విద్యుత్‌ వినియోగం

వడగాలులతో ఇళ్లకే పరిమితంఅవుతున్న ప్రజలు

జిల్లాలో తగ్గుతున్న ‘గృహజ్యోతి’ లబ్ధిదారులు

ఈ ఏడాది ఏనెలలో ఎంతమంది గృహజ్యోతి లబ్ధిదారులు?

మే 1,36,384

ఏప్రిల్‌ 1,38,984

మార్చి 1,39,576

ఫిబ్రవరి 1,39,803

డిమాండ్‌కు తగినట్లు ఏర్పాట్లు

విద్యుత్‌ డిమాండ్‌కు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఉష్ణోగ్రతలు పెరగడం, గృహ వినియోగం, వ్యవసాయ అవసరాలు అధికం కావడం వంటి కారణాలతో విద్యుత్‌ వినియోగం రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఫీడర్లు, సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు నిరంతరం పర్యవేక్షిస్తూ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.

– గంగాధర్‌, ఎస్‌ఈ, ట్రాన్స్‌కో

Advertisement
 
Advertisement
Advertisement