అంజన్నకు కలెక్టర్‌ మొక్కులు | - | Sakshi
Sakshi News home page

అంజన్నకు కలెక్టర్‌ మొక్కులు

Jun 1 2026 7:17 AM | Updated on Jun 1 2026 7:17 AM

మల్యాల: జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట శ్రీకొండగట్టు ఆంజనేయస్వా మిని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష కుటుంబ ఆదివా రం దర్శించుకుంది. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు కలెక్టర్‌కు సాదర స్వాగతం పలికారు.

వసతులు కల్పించాలి

మంథని: విద్యార్ధులకు మెరుగైన క్రీడా, సంగీ త, విద్యా వసతులు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆదేశించారు. స్థానిక గంగాపురిలోని ఎంపీపీఎస్‌, క్రీడా మై దానం, సంగీత పాఠశాలను ఆదివారం పరిశీలించారు. రావుల చెరువు, అయ్యగారి చెరువు సందర్శించి పరిస్థితులను పర్యవేక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ, గంగాపురి ఎంపీపీఎస్‌ క్రీ డా మైదానం అభివృద్ధికి అవసరమైన అంచనా లు సిద్ధం చేయాలన్నారు. సంగీత పాఠశాల రెనోవేషన్‌ పనులు పూర్తిచేసి రాబోయే విద్యా సంవత్సరంలో ప్రారంభించాలని అన్నారు. ప్ర జల రాకపోకలకు అనుగుణంగా చెరువు రోడ్డు విస్తరణ పనులు చేపట్లాని సూచించారు. ము న్సిపల్‌ కమిషనర్‌ మనోహర్‌ పాల్గొన్నారు.

ఓదెల మల్లన్నకు పట్నాలు

ఓదెల: ఓదెల మల్లికార్జునస్వామి దేవస్థానంలో ఆదివారం భక్తులు మల్లన్న పట్నాలు వేశారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కోనేరులో స్నానాలు ఆచరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశా రు. మల్లికార్జునస్వామి, ఖండేలరాయుడు, శ్రీ సీతారామచంద్రస్వామిని దర్శనం చేసుకున్నా రు. ఈవో సదయ్య ఏర్పాట్లు పర్యవేక్షించారు.

న్యాయం చేయాలి

పెద్దపల్లి: తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు, గౌరవం, సంక్షేమం ఫలాలు వర్తింపజేయా లని తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఉమ్మ డి కరీంనగర్‌ జిల్లా ఇన్‌చార్జి కావటి సతీశ్‌యాదవ్‌ కోరారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జూన్‌ 21న హై దరాబాద్‌ ఇందిరాపార్క్‌ వద్ద ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. నాయకులు మొలుగూరి కమల్‌, అరె తిరుపతి, కొంకటి లింగమూర్తి, కటకం హర్షవ ర్ధన్‌, గంగుల నరేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

ధర్మారంలో వడగళ్లవాన

ధర్మారం: మండల కేంద్రంతోపాటు వివిధ గ్రా మాల్లో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వడగళ్లవాన కురిసింది. ఈదురు గాలులతో దుకాణాల ఎదుట ఏర్పాటు చేసిన నేమ్‌ బోర్టులు కుప్పకూలిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో పాన్‌టేలాలు కిందపడ్డాయి. ధర్మా రం – పెద్దపల్లి మధ్య రోడ్డు వెంట చెట్లు విరిగిపడి రాకపోకలకు అంతరాయం కలిగింది. మామిడికాయలు నేలరాలాయి. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం కుప్పల కిందికి నీరు చేరి తడిసి ముద్దయ్యింది.

నృసింహునికి పూజలు

పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లి మండలం దేవునిపల్లిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా ఆదివారం స్వామివారికి పంచామృతాభిషేకం, చందనోత్సవం ఘనంగా నిర్వహించారు. పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం అన్నదానం చేశారు.

సింగరేణిలో జీఎంల బదిలీ

గోదావరిఖని: సింగరేణి బొగ్గు గనుల సంస్థలో నలుగురు జీఎంలను బదిలీ చేస్తూ ఆదివారం ఆదేశాలు జారీ అయ్యాయి. ఐఅండ్‌పీఎం కా ర్పొరేట్‌ జీఎం మిర్యాల శ్రీహరిని కాంటాక్ట్‌ మే నేజ్‌మెంట్‌ సెల్‌కు బదిలీ చేశారు. మందమర్రి కేకే ఓసీపీలోని ఎం.మల్లేశంను రామగుండం రీజియన్‌ సేఫ్టీకి, ఆర్కే–7గ్రూప్‌ ఏజెంట్‌ కుర్మ రాజేందర్‌ను పాలిటెక్నిక్‌ ప్రిన్సిపల్‌గా నియమించారు. మణుగూరు పీకే ఓసీపీ అధికారి శ్రీరమేశ్‌ను బెల్లంపల్లికి బదిలీ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement