బాధ్యతలు భారం | - | Sakshi
Sakshi News home page

బాధ్యతలు భారం

Jun 1 2026 7:17 AM | Updated on Jun 1 2026 7:17 AM

ఉపాధి పనుల పర్యవేక్షణ ఇక సెక్రటరీలకే గ్రామ పంచాయతీ విధుల్లోనే సతమతం ఆందోళన వ్యక్తం చేస్తున్న పంచాయతీ కార్యదర్శులు

మంథనిరూరల్‌: గ్రామ పంంచాయతీ కార్యదర్శల కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఇ టీవల ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటికే గ్రామపాలన, పారిఽశుధ్యం పర్యవేక్షణ, రికార్డుల నిర్వహణ, సంక్షేమ పథకాల పరిశీలన, ప్రత్యేక సమావేశాలు నిర్వహించే పంచాయతీ కార్యదర్శులకు తాజాగా మరికొన్ని బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్త ర్వులు జారీచేసింది. ఇప్పటి వరకు ఉపాధిహామీ అమలులో భాగస్వాములైన పంచాయతీ కార్యదర్శులకు పనుల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది. తాజా సర్క్యూర్‌తో పంచాయతీ కార్యదర్శులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలోని 263 గ్రామపంచాయతీల్లో..

జిల్లాలో 14 మండలాలు, 263 గ్రామ పంచాయతీ ల్లో ఉపాధిహామీ పనులు కొనసాగుతున్నాయి. ఒక్కో పంచాయతీకి ఒక్కోఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఉండాలి. అనేక పంయతీల్లో వారు లేక మేట్లు నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. పనులపై పర్యవేక్షణ కొరవడటంతో పంచాయతీ కార్యదర్శులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు.

ఫీల్డ్‌ అసిస్టెంట్ల తొలగింపుతో..

గత ప్రభుత్వం ఉపాధిహామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లను తొలగించింది. పనుల పర్యవేక్షణ బాధ్యతలను పంచాయతీ కార్యదర్శులకు అప్పగించింది. టెక్నికల్‌ అసిస్టెంట్లతో కలిసి కార్యదర్శులు పనులు నిర్వహించేవారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీల్డ్‌ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవడంతో పంచాయతీ కార్యదర్శులు రెగ్యులర్‌ విధులకే పరిమితమయ్యారు. ఈ క్రమంలో అనేక గ్రామాల్లో ఉపాధిపనులపై పర్యవేక్షణ లోపించినట్లు గుర్తించిన ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీచేసింది.

భారమవుతున్న బాధ్యతలు

పంచాయతీ కార్యదర్శులకు ఉపాధిహామీ పనుల పర్యవేక్షణ బాధ్యతలు భారమవుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పంచాయతీల్లో వివిధ బాధ్యతలు నిర్వహించే తమకు పనుల పర్యవేక్షణ అదనపు భారమంటున్నారు. నిత్యం గ్రామాల్లో ప్రజలకు అవసరమయ్యే కార్యక్రమాలతో పాటు వివిధ అభివృద్ది పనులు చేస్తున్నామని వారు చెబుతున్నారు. తాజాగా ప్రభుత్వ తీసుకున్న నిర్ణయంతో ఇటు అభివృద్ది, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమా లు కుంటుపడే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

తాజా సర్క్యూలర్‌లో..

ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వులతో గ్రామ పంచాయతీ కార్యదర్శుల పర్యవేక్షణ బాధ్యతలను వెల్లడించారు. వంద రోజుల పనులు, వనమహో త్సవ కార్యక్రమ పర్యవేక్షణ, మేట్ల నియామకం, ఉపాధిహామీ కూలీల నుంచి పని డిమాండ్‌ వివరాల సేకరణ, కూలీల మస్టర్ల నమోదు, వారం చివరలో మస్టర్‌ల కౌంటర్‌ సైన్‌ చేసి టెక్నికల్‌ అసిస్టెంట్లకు అప్పగించాలి. అలాగే ఎన్‌ఎంఎంఎస్‌ యాప్‌లో కూలీల ఫేస్‌ అథెంటికేషన్‌ ద్వారా హాజరు అప్‌లోడ్‌ కూడా చేయాలి.

చెరువులో బంటాల పనిచేస్తున్న ఉపాధి కూలీలు

పింఛన్‌దారు ఫొటో తీసుకుంటున్న కార్యదర్శి

Advertisement
 
Advertisement
Advertisement