గోదావరిఖని: సింగరేణి బొగ్గు గనుల సంస్థలో అంతర్గత ఉద్యోగాల భర్తీకి యాజమాన్యం నిర్ణయించింది. మెడికల్ ఇన్వాలిడేషన్ ప్రారంభమైన క్రమంలో సుమారు 17వేల మంది ఉన్నత విద్యావంతులు సంస్థలో చేరారు. ఇలాంటి వారి సేవలను సంపూర్ణంగా వినియోగించుకునేందుకు నిర్ణయించింది. ఇందులో 50 మందిని విద్యార్హతలు, ఆసక్తిగలవారిని ఎంపిక చేయాలని గతనెల 30న సీఆర్‌పీ/పీఈఆర్/ఆర్/2026/309 పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈనెల 3న నుంచి ఈనెల 16వ తేదీ వరకు www.scclmines.com వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
ఉద్యోగ వివరాలు
ఫిజియోథెరపిస్ట్ 02
డైటీషియన్ 02
ఫార్మాసిస్ట్ 19
రెఫ్రాక్షనిస్ట్ 01
జూనియర్ ఎక్స్‌రే టెక్సీషియన్ 06
జూనియర్ ల్యాబ్ టెక్నీషియన్ 15
ఈసీజీ/టూడీ ఈకో/టీఎంటీ టెక్నీషియన్ 03
హెల్త్ ఎడ్యుకేటర్ 02
50 పోస్టుల భర్తీకి సింగరేణి కసరత్తు


