క్రీడాకారుల డిమాండ్లు ఇవి..
క్రికెట్‌పై ఉన్న ఆసక్తితో సిరిసిల్ల కాలేజీ మైదానంలో రెండేళ్లుగా శిక్షణ తీసుకుంటున్నా. అండర్–14 విభాగంలో జనవరి–2026లో రాజస్థాన్‌లో జరిగిన నేషనల్ పోటీల్లో పాల్గొన్నా. డిసెంబర్ 2025లో భద్రాచలంలో రాష్ట్రీయ పోటీల్లో ఆడాను. క్రికెట్‌లో ఆల్‌రౌండర్‌గా రాణించడం లక్ష్యం.
– బంధం వర్షిత్, 9వతరగతి
మా కోచ్‌ల శిక్షణలో నిత్యం రెండు పూటలా ప్రాక్టీస్ చేస్తున్నా. క్రికెట్‌లో టీం కలిసికట్టుగా ఆడి గెలవడం అంటే ఇష్టం. ఉదయం 5.45 గంటల నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 4.30 నుంచి 6.45 గంటల వరకు కోచ్‌లు వంగల సాయితేజ్, దొబ్బల ప్రేమ్‌కుమార్ వద్ద శిక్షణ పొందుతున్నాం. రాష్ట్ర పోటీల్లో జిల్లాకు ట్రోఫీ సాధిస్తాం.
– తిప్పవరం నిశాంక్, మండేపల్లి మోడల్ స్కూల్
సిరిసిల్లలో మంచి క్రికెట్ మైదానం కావాలి.
టర్ఫ్ పిచ్ ఏర్పాటు చేస్తే దానిపై శిక్షణ బాగుంటుంది.
చుట్టుపక్కల జిల్లాల్లో టర్ఫ్ పిచ్‌పై పిల్లలు ఆడుతున్నారు.
సిరిసిల్లలో ప్రత్యేకంగా క్రికెట్ మైదాన ఏర్పాటు అత్యవసరం.
గ్రౌండులో క్రికెట్ శిక్షణకు కావాల్సిన పరికరాలు అందించాలి.
ప్రాక్టీస్ నెట్లు, చీకట్లో ఆడేలా ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేయాలి.


