కాల్వశ్రీరాంపూర్: పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన ఆరెల్లి సాయిరాం(24) బీటెక్ విద్యార్థి చేసి ఉద్యోగం రావడంలేదనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. మే 29న పురుగులమందు తాగిన సాయిరాంను కరీంనగర్‌లోని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడి తల్లి సుజాత మాజీ సర్పంచ్, తండ్రి రమేశ్ సర్పంచ్‌గా కొనసాగుతున్నారు. సాయిరాం మృతితో గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వెంకటేశ్ తెలిపారు. సాయిరాం కుటుంబ సభ్యులను ప్రభుత్వ విప్ విజయరమణారావు పరామర్శించారు. అంత్యక్రియలకు హాజరయ్యారు. మాజీ ఎంపీపీ సారయ్యగౌడ్, ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాజనవేన సదయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య
ఫెర్టిలైజర్‌సిటీ: పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ 23వ డివిజన్ మాతంగికాలనీకి చెందిన సింహరాజు శివకుమార్(45) శనివారం రాత్రి ఇంట్లో ఇనుపరాడ్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు కథనం ప్రకారం.. సింహరాజు శివకుమార్ మాతంగికాలనీలో పదేళ్లక్రితం ఇల్లు కొనుగోలు చేశాడు. ఇందుకోసం కొంత అప్పు చేశాడు. వాటిని తీర్చేదారిలేక, ఆర్థిక ఇబ్బందులు అధికమై మద్యానికి బానిసయ్యాడు. ఈక్రమంలో జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈమేరకు మృతుడి భార్య భాగ్యలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడికి భార్య, ఇద్దరు కుమారులు వీణాచారి, రానాచారి ఉన్నారు. ఎస్సై ఉదయ్ కిరణ్ కేసు నమోదు చేసుకున్నారు.


