బన్నీ వేసవి యాత్ర–23 పంచుకు తిందాము | - | Sakshi
Sakshi News home page

బన్నీ వేసవి యాత్ర–23 పంచుకు తిందాము

Jun 1 2026 7:17 AM | Updated on Jun 1 2026 7:17 AM

మధ్యాహ్నం మర్రిచెట్టు కింద లంచ్‌ బాక్స్‌లు ఓపెన్‌ చేశారు బన్నీ, రామ్‌, చుక్క , స్వప్న.

బన్నీ బాక్స్‌లో 4 గులాబ్‌ జామ్‌లు ఉన్నాయి. రామ్‌ బాక్స్‌లో ఒక్క బిస్కెట్‌ కూడా లేదు.

రామ్‌ బాధగా మూలకు కూర్చున్నాడు. చుక్క చూసి తాతయ్యను పిలిచింది.

తాతయ్య: ‘తిండి ఉన్నోడు లేనోడికి పెడితేనే దానికి రుచి.’

బన్నీ ఆలోచించి రెండు గులాబ్‌ జామ్‌లు తీసి రామ్‌కి ఇచ్చాడు.

స్వప్న తన పులిహోరలో సగం చుక్కకు పెట్టింది. ‘ఇద్దరం తిందాం’ అంది.

తాతయ్య నవ్వాడు: ‘పంచుకుంటే ఆకలి తీరుతుంది, ప్రేమ పెరుగుతుంది.’

రామ్‌ లేచి అన్నాడు: ‘థాంక్స్‌ రా బన్నీ. రేపు నా లడ్డు నీకు.’

చుక్క చెప్పింది: ‘మనం నలుగురం ఒక టీమ్‌. ఒకరి బాధ ఒకరికి తెలుసు.’

తాతయ్య: ‘ఒంటరిగా తింటే కడుపు నిండుతుంది. పంచుకుంటే మనసు నిండుతుంది.’

పిల్లలకి మాట :

నీ దగ్గర ఉన్నది చిన్నదైనా,

పంచితే అది పెద్దది అవుతుంది.

– డాక్టర్‌ కోట లక్ష్మణ్‌,

ప్రభుత్వ ఉపాధ్యాయుడు,

గ్రామం: కాకర్లపల్లి,

మంథని, జిల్లా: పెద్దపల్లి

Advertisement
 
Advertisement
Advertisement