పెద్దపల్లి: జిల్లా కేంద్రంలో జూన్ 2వ తేదీన నిర్వహించే రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు శనివారం ఉత్తర్వులు జారీచేశారు. విప్ జెండా ఆవిష్కరించి సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
వాణిజ్య కార్యకలాపాలు షురూ
జ్యోతినగర్: రామగుండంలోని ఎన్టీపీసీలో ని ర్మించిన 176 మెగావాట్ల సోలార్ ఫొటో వొల్టాయిక్(పీవీ) ప్రాజెక్టులో 34.4 మెగావాట్ల సా మర్థ్యం గల రెండోవిడత ప్లాంట్ వాణిజ్య కార్యకలాపాల్లోకి అడుగుపెట్టింది. శుక్రవారం అర్ధరాత్రి తన వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించిందని అధికారులు వెల్లడించారు. రామగుండంలోని తన 176 మెగావాట్ల సోలార్ పీవీ ప్రాజెక్టులో రెండో విడత సామర్థ్యం 34.4 మెగావాట్ల విద్యుత్ వాణిజ్య కార్యకలాపాలు మే 29న అమల్లోకి వచ్చాయని వివరించారు. గతనెల 2న తొలివిడతలో 100 మెగావాట్ల వా ణిజ్య కార్యకలాపాలను ప్రారభించిన విష యం విదితమే. ఎన్టీపీసీ గ్రూప్ మొత్తం స్థాపిత సామర్థ్యం 90,807 మెగావాట్లకు పెరిగిందని, దానివాణిజ్య సామర్థ్యం ప్రస్తుతం 88,927 మెగావాట్లుగా ఉందని పేర్కొన్నారు.
వైద్యులను నియమించాలి
మంథని: ఆడబిడ్డల కాన్పు కష్టాలు తీర్చేందు కు గత ప్రభుత్వం పట్టణంలో నిర్మించిన మా తా శిశు ఆస్పత్రిపై మంథని ఎమ్మెల్యే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, వెంటనే వైద్యులను ని యమించాలని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ డిమాండ్ చేశారు. శనివారం మాతాశిశు ఆస్పత్రిని సందర్శించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. రెండున్నరేళ్లలో ఆస్పత్రిని నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. ఆస్పత్రి లో అన్ని సౌకర్యాలు ఉన్నా వైద్యులను నియమించడం లేదని, ఈ విషయంలో కలెక్టర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. భూ పాలపల్లి జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ జక్కు శ్రీహర్షిణి– రాకేశ్, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ఏ గోళపు శంకర్‌గౌడ్, రెండోవార్డు కౌన్సిలర్ రాజు గౌడ్, మాజీ జెడ్పీటీసీ తగరం సుమలత – శంకర్‌లాల్, నాయకులు పుప్పాల తిరుపతి, జంజర్ల శేఖర్, కనవేన శ్రీనివాస్, విజయ్‌కుమార్, శంకేషి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
బాధ్యతలు స్వీకరణ
పెద్దపల్లి: డీఆర్వో గా రాజేశ్వరి శనివారం బాధ్యతలు స్వీకరించారు. అ నంతరం కలెక్టర్ కోయ శ్రీహర్షను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందజేశారు. రాజేశ్వరి కరీంనగర్ నుంచి బదిలీపై ఇక్కడకు వచ్చారు.
రీకౌంటింగ్‌కు దరఖాస్తులు
పెద్దపల్లి: ఓపెన్ టెన్త్, ఇంటర్ రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం జూన్ 7వ తేదీలోగా దర ఖా స్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి శా రద తెలిపారు. ఓపెన్ టెన్త్ పరీక్షకు 991 మంది హాజరుకాగా 840మంది ఉత్తీర్ణులయ్యారని, ఇంటర్‌కు 1,584 మంది హాజరు కాగా1,084 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. జవాబు పత్రా ల రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం గడువులో గా www.telanganaopenschool.org వెబ్‌సై ట్, లేదా మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని డీఈవో సూచించారు.
‘ధాన్యం కొనుగోళ్లలో విఫలం’
పెద్దపల్లిరూరల్: ధాన్యం, మక్కల కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ జి ్లా అధ్యక్షుడు కర్రెసంజీవరెడ్డి విమర్శించారు. స్థా నిక బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర నాయకుడు గొట్టిముక్కుల సురేశ్‌రెడ్డితో కలిసి శనివారం వి లేకరులతో మాట్లాడారు. బీజేపీ ప్రజాప్రతిని ధుల బస్సుయా త్ర వస్తుందని తెలిసి రాత్రికిరాత్రే బిహార్ కూలీలతో కొనుగోళ్లు చేశారన్నా రు. ఎమ్మెల్యేలకు చెరువు మట్టి, ఇసుక తరలింపుపై ఉన్న శ్రద్ధ రైతుల సంక్షేమంపై లేదని దు య్యబట్టారు. సీఎమ్మార్ బకాయిలు రూ.కోట్ల లో ఉన్న 70 మంది రైస్‌మిల్లర్లను బ్లాక్ లిస్టులో పెట్టాల్సింది పోయి వారికే మళ్లీ అనుమతులు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. శివంగారి సతీ శ్, బెజ్జంకి దిలీప్‌కుమార్, కందుల శ్రీనివాస్, రాజ్‌కుమార్, విజయ్, అఖిల్, ప్రవీణ్‌కుమార్, వెంకటకృష్ణ, రాకేశ్, వంశీ పాల్గొన్నారు.


