ఐటీలో మేటి మంత్రి శ్రీధర్‌బాబు | - | Sakshi
Sakshi News home page

ఐటీలో మేటి మంత్రి శ్రీధర్‌బాబు

May 31 2026 1:18 AM | Updated on May 31 2026 1:18 AM

పెద్దపల్లి: ఐటీ రంగంలో మంత్రి శ్రీధర్‌బాబు దూసుకు వెళ్తున్నారని ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్‌ అంబేడ్కర్‌ చౌరస్తాలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. విప్‌ కేక్‌ కట్‌ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ, శ్రీధర్‌బాబు మంథని నియోజకవర్గం నుంచి ఐదుసార్లు శాసనసభ్యుడిగా, రెండుసార్లు మంత్రిగా సేవలు అందించారన్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమించారని విప్‌ అన్నారు. కాంగ్రెస్‌ పాలనలో రాష్ట్రాభివృద్ధి కోసం ఆయన చేస్తున్న సేవలు అమోఘమన్నారు. ఐటీ కంపెనీలు, పరిశ్రమలు తెప్పిస్తూ అనేకమంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో శ్రీధర్‌బాబు కృషి ఎనలేదనిదని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అంతటి అన్నయ్యగౌడ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ బిరుదు రాధాకష్ణ, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మినుపాల ప్రకాశ్‌రావు, మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ అంతటి పుష్పలత, కాంగ్రెస్‌ పట్టణ, మండల అధ్యక్షులు వేగోళం అబ్బయ్యగౌడ్‌, చిలుక సతీశ్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు డి.దామోదర్‌రావు, డీసీసీ కార్యదర్శి మోబిన్‌, నాయకులు సాయిరి మహేందర్‌, పన్నాల రాములు, డి.శ్రీనివాసరావు, పల్లా సురేశ్‌, సర్పంచులు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ విప్‌ విజయరమణారావు

ఘనంగా మంత్రి శ్రీధర్‌బాబు పుట్టినరోజు వేడుకలు

Advertisement
 
Advertisement
Advertisement