పెద్దపల్లి: పెద్దపల్లి బాల్య వివాహరిత జిల్లాగా ఆవిర్భవించిందని కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రకటించారు. కలెక్టరేట్‌లో శనివారం స్నేహ కిశోర బాలికల సంఘం ఆధ్వర్యంలో మాక్ పార్లమెంట్– 99 రోజుల ప్రజా –పాలనప్రగతి ప్రణాళిక మహిళా వారోత్సవాలు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ, పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీలు, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు మొత్తం 14 మండలాల్లోగల గ్రామ పంచాయతీల్లో ఎక్కడా బాల్య వివాహాలు చోటుచేసుకోవడం లేదన్నారు. ఈమేరకు ధ్రువీకరిస్తూ పెద్దపల్లిని బాల్య వివాహ రహిత జిల్లాగా ప్రకటిస్తున్నామని వెల్లడించారు. మహిళలపై అఘాయిత్యాలు, వేధింపులు, వివక్షను అరికట్టేందుకు ప్రతీఒక్కరు బాధ్యతతో కృషి చేయాలని ఆయన కోరారు.
ఉల్లాస్.. సక్సెస్
మహిళా సంఘాల్లో నిరాక్షరాస్యులను ఉల్లాస్ కా ర్యక్రమం కింద నమోదు చేసి 5 వేల మంది వలంటీర్ల సహకారంతో చదువు చెప్పిస్తున్నామని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. కలెక్టరేట్‌లో శనివారం వివిధ అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. గత మార్చిలో నిర్వహించిన పరీక్షలకు 34,620 మంది మహిళలు హాజరై 100 శాతం ఉత్తీర్ణత సాధించడం గర్వకారణమన్నారు. జనగణన–2027లో చేపట్టిన హౌస్‌లిస్టింగ్ సర్వేకు వచ్చే ఎన్యూమరేటర్లకు ప్రజలు వాస్తవ సమాచా రం అందించి సహకరించాలని ఆయన కోరారు. 2026–27 విద్యా సంవత్సరానికి బెస్ట్ అవైలేబుల్ స్కూల్స్(రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్) పాఠశాలల్లో ఒకటి, ఐదో తరగతుల్లో ప్రవేశాల కోసం అర్హులైన షెడ్యూల్డ్ కులాల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. వివరాలకు 90143 27045, 99893 54155 నంబర్లలో సంప్రదించాలని కలెక్టర్ కోరారు. కార్యక్రమంలో డీఆర్డీవో కాళిందిని, అదనపు అధికారి రవీందర్, సంక్షేమాధికారి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
ప్రకటించిన కలెక్టర్ కోయ శ్రీహర్ష


