సిబ్బంది సేవలు అభినందనీయం | - | Sakshi
Sakshi News home page

సిబ్బంది సేవలు అభినందనీయం

May 31 2026 1:18 AM | Updated on May 31 2026 1:18 AM

జ్యోతినగర్‌: నగరంలో శానిటేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్న సిబ్బంది సేవలు అభినందనీయమని మేయర్‌ మహంకాళి స్వామి అన్నారు. ఒకటో డివిజన్‌లో శనివారం వార్డు సందర్శన చేపట్టారు. డిప్యూటీ మేయర్‌ పాతిపెల్లి ఎల్లయ్య, కమిషనర్‌ అరుణశ్రీ, కార్పొరేటర్‌ మడిపల్లి విజయతో కలిసి ఆయన పనులు పరిశీలించారు. కాలువల్లో యుద్ధ ప్రాతిపదికన పూడిక తొలగించి వరద ముప్పు నివారించాలని మేయర్‌ సూచించారు. యంత్రాలు, సిబ్బంది సాయంతో న్యూపీకే రామయ్యకాలనీ ప ట్టణ ప్రకృతి వనం సమీప వీధుల్లోని కాలువల్లో పూడిక తొలగించామని ఆయన చెప్పారు. ఇందిరమ్మ కాలనీ ఏర్పడిన నాటినుంచి పూడిక తీ యలేదన్నారు. మిగిలిన యూజీడీ పనులు, రోడ్లను పూర్తిచేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో కా ర్పొరేటర్‌ వెంగళ బాపు, ఎస్‌ఈ గురువీర, డిప్యూటీ కమిషనర్‌ వెంకటస్వామి, తేజస్విని, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ సంపత్‌, సీనియర్‌ అకౌంటెంట్‌ రాజ్‌కుమార్‌, జవాన్‌ సూర్య తదితరులు పాల్గొన్నారు.

మేయర్‌ మహంకాళి స్వామి

Advertisement
 
Advertisement
Advertisement