నేరస్తులకు శిక్ష పడాలి | - | Sakshi
Sakshi News home page

నేరస్తులకు శిక్ష పడాలి

May 31 2026 1:18 AM | Updated on May 31 2026 1:18 AM

గోదావరిఖని: నేరస్తులకు శిక్షపడితేనే నేరాలు తగ్గి ప్రజలు సంతోషంగా ఉంటారని రామగుండం పో లీస్‌కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా అన్నారు. రామగుండం పోలీస్‌కమిషనరేట్‌లో పోలీస్‌ అధికారుల తో కలిసి శనివారం నేర సమీక్ష చేశారు. నేరస్తులకు శిక్ష పడేలా సాక్షులను ప్రవేశపెట్టి ట్రయల్‌ సజావు గా జరిగేలా చొరవ తీసుకోవాలన్నారు. దోషులకు శిక్షపడే ప్రక్రియలో కోర్టు కానిస్టేబుళ్ల బాధ్యత ఎంతో కీలకమైందని ఆయన అన్నారు. కోర్టు ప్రాసిక్యూషన్‌కు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పు డు సంబంధిత స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌కు తెలియజేయాలని, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సూచనలు, సలహా లను పాటించాలని సీపీ సూచించారు. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటే పోలీసులపై ప్రజల్లో నమ్మకం మరింత పెరుగుతుందని చెప్పారు. సమావేశంలో పోలీసు అధికారులు, స్టేషన్‌హౌస్‌ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement