రామగుండం: రైలులో చోరీకి పాల్పడిన నిందితుడి ని అదుపులోకి తీసుకొని సొత్తు స్వాధీనం చేసుకు న్న ఘటన శనివారం మంచిర్యాలలో జరిగింది. రా మగుండం రైల్వే ఆర్‌పీఎఫ్ సీఐ రాజేంద్రప్రసాద్ వి వరాల ప్రకారం.. ఈనెల 25న స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్ రైలులో ఓ ప్రయాణికురాలు బల్హర్షాలో రైలు ఎక్కి నిద్రిస్తున్న క్రమంలో.. బ్యాగ్‌ను సిర్పూర్ కాగజ్‌నగర్ వద్ద దొంగిలించి అందులో ఉన్న బంగారు లాకెట్, రూ.1,300 నగదు తీసుకొని బ్యాగ్‌ను పడేశాడు. మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా.. రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా చోరీ చేసిన విషయం వెలుగు చూసింది. సిర్పూర్ కాగజ్‌నగర్‌కు చెందిన దుర్గం ప్రేమ్‌కుమార్ నుంచి 8 గ్రాముల బంగారు లాకెట్‌ను స్వాధీనపరచుకున్నారు. కాజీపేట రైల్వే కోర్టుకు రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును ఛేదించిన రైల్వే ఏఎస్‌ఐ బి.రామకృష్ణ, హెడ్ కానిస్టేబుల్ చంద్రమౌళి, బి.స్వామి, జీఆర్పీ కానిస్టేబుళ్లు ఎస్.కుమార్, కె.శంకర్, టి.మల్లాగౌడ్ తదితరులను అభినందించారు. కాజీపేట ఆర్‌పీఎఫ్ సీఐ వి.నరేశ్, మంచిర్యాల, బెల్లంపల్లి జీఆర్పీ ఎస్సైలు మహేందర్, సుధాకర్ తదితరులు ఉన్నారు.


