కాల్వశ్రీరాంపూర్/పెద్దపల్లిరూరల్/కోనరావుపేట: పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో శనివారం వడదెబ్బకు గురై ముగ్గురు చనిపోయారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామానికి చెందన తూముల శ్రావణ్ కుమార్(37)ఉదయం పొలం వద్దకు వెళ్లి అస్వస్థతకు గురయ్యాడు. ఇంటికి వచ్చి, మంచంలో పడుకుని నిద్రలోనే చనిపోయాడు. పెద్దపల్లిలో లారీ క్లీనర్‌గా పనిచేసేందుకు వచ్చిన మహమ్మద్ ఇక్రం(48) ఎండదెబ్బతో మూడు రోజులుగా చికిత్సపొందుతూ శనివారం మరణించాడు. ఉత్తరప్రదేశ్‌లోని జగ్దల్‌పూర్‌కు చెందిన ఇక్రం నాలుగు నెలలుగా లారీ క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేట మండలం మామిడిపల్లికి చెందిన షేక్ హైదర్(57) ఉపాధి పనులకు వెళ్లి అస్వస్థతకు గురై, వడదెబ్బతో చనిపోయాడు.


