వరి వైపే మొగ్గు | - | Sakshi
Sakshi News home page

వరి వైపే మొగ్గు

May 30 2026 8:53 AM | Updated on May 30 2026 8:53 AM

వానాకాలం సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లు చివరిదశకు చేరాయి. దీంతో వచ్చేసీజన్‌పై దృష్టి సారించారు. ఇందుకు అ నుగుణంగానే వానాకాలం సాగు ప్రణాళిక ఖరారైంది. జిల్లావ్యాప్తంగా 2,78,290 ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ అధికారులు ప్రణాళికా సిద్ధం చేశారు. గతేడాది కన్నా ఈసారి సుమారు 2,300 ఎకరాల్లో సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా. రైతులు దుక్కి దున్ని సాగుకు సిద్ధమవుతున్నారు. 2.15 లక్షల ఎకరాల్లో వరి సాగయ్యే అవకాశం ఉంది. తర్వాత పత్తి, జొన్న, మొక్కజొన్న, కంది, చిరుధాన్యాలు పండి స్తారు. సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువుల వినియోగం, ఇతర అంశాలపై అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. సబ్సిడీ విత్తనాలు పంపిణీ చేసేందుకు 51 విక్రయ కేంద్రాలను గుర్తించారు.

సాగు విస్తీర్ణంలో 77 శాతం అదేపంట

తర్వాతి స్థానాల్లో పత్తి, మొక్కజొన్న

చివరిదశకు చేరిన యాసంగి ధాన్యం కొనుగోళ్లు

వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్న అన్నదాతలు

సాక్షి పెద్దపల్లి:

బోనస్‌ చెల్లిస్తుండడంతో..

జిల్లాలో ఏటా వరిసాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది. ఇతర పంటల సాగు తగ్గుతూ వస్తోంది. ఇందు కు కారణం.. వరినాటు సమయంలో తప్పితే మిగ తా పనులన్నీ సులువుగా పూర్తవుతుండడం, ప్రభు త్వం సన్నవడ్లకు క్వింటాలుపై రూ.500 బోనస్‌ చె ల్లిస్తుండటంతో రైతులు వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు. ఇదేసమయంలో ఇతర పంటలకు సస్యరక్షణ చర్యలు ప్రహసనంగా మారండంతో విత్తడం తగ్గించేస్తున్నారు. కాలం కలిసి వస్తే దిగుబడులు భారీగా రావడంతోపాటు వ్యక్తిగత అవసరాల కో సం మొత్తం సాగులో సగభాగం సన్నరకం వరి సాగు చేసేందుకు మొగ్గు చూపుతుండడం సాగు విస్తీర్ణం పెరగడానికి కారణంగా నిలుస్తున్నది.

వానాకాలం సాగు వివరాలు(ఎకరాల్లో)

వరి 2,15,500

పత్తి 52,094

మొక్కజొన్న 886

కంది 208

పెసర 10

మినుములు 11

పప్పుధాన్యాలు 12

వేరుశెనగ 2

నువ్వులు 16

ఆయిల్‌పామ్‌ 3,179

మిరప 133

పసుపు 295

ఆహార 376

ఉద్యాన 5125

ఆహారేతర 415

అవసరమైన విత్తనాలు, ఎరువులు(క్వింటాళ్లలో)

వరి 53,125

మొక్కజొన్న 70.5

కంది 30

పప్పుధాన్యాలు 1.6

యూరియా 31,138

డీఏపీ 3,767

పత్తి(ప్యాకెట్లు) 1,31,250

పంట మార్పిడి పద్ధతి పాటిస్తేనే మేలు

వానాకాలం సీజన్‌ మరికొద్దిరోజుల్లోనే ప్రారంభం కానున్నది. ఈమేరకు జిల్లాలో సాగు ప్రణాళిక సిద్ధం చేశాం. వరి సాగుకే రైతులు మొగ్గుచూపుతున్నారు. ఎప్పుడూ ఒకే పంట కాకుండా ఏటా పంట మార్పిడి పద్ధతి పాటిస్తే అధిక దిగుబడి సాధించవచ్చు. జిల్లా రైతులకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచుతున్నాం. ఎవరికై నా ఏదైనా సమస్య ఉంటే స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారులకు ఫోన్‌చేసి సలహాలు, సూచనలు పొందవచ్చు. – శ్రీనివాస్‌, జిల్లా వ్యవసాయాధికారి

Advertisement
 
Advertisement
Advertisement