గోదావరిఖని: క్రమశిక్షణ, సమష్టి పనివిధానంతో ముందుకు సాగి సంస్థను అగ్రభాగాన నిలబెట్టాలని సింగరేణి సీఎండీ బుద్ధ ప్రకాశ్ జ్యోతి సూచించా రు. ఆర్జీ–వన్‌లోని జీడీకే–11గనిలో కా ర్మికులతో శుక్రవారం ముఖాముఖి ని ర్వహించారు. కార్మికుల ఆలోచనలు, సలహాలు తీసుకున్నారు. గనిలో 5వ మ్యాన్ రైడింగ్ సిస్టం ప్రారంభించారు. సంస్థ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన ఉద్యోగులను అభినందించారు. డైరెక్టర్లు ఎల్‌వీ సూర్యనారాయణ, కె.వెంకటేశ్వర్లు, జీఎం లలిత్‌కుమార్ పాల్గొన్నారు. అనంతరం జీడీకే–5 ఓసీపీ సందర్శించారు. గోదావరిఖనిలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల కోసం ఏర్పాటు చేసిన క్రీడా, వినోద సౌకర్యాలు పరిశీలించారు. ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, డైరెక్టర్ (ఈఅండ్‌ఎం) ఎం.తిరుమలరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకన్న, జీఎం(సీడీఎన్), మార్కెటింగ్ టి.శ్రీనివాస్, ఆర్జీ–3 జీఎం, మధుసూదన్, ఆర్జీ–2 ఇన్‌చార్జి జీఎం రాముడు పాల్గొన్నారు.


