రైతులపై రాజకీయమా? | - | Sakshi
Sakshi News home page

రైతులపై రాజకీయమా?

May 30 2026 8:53 AM | Updated on May 30 2026 8:53 AM

● ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

మంథని: బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతలు రైతులపై రాజకీయం చేస్తున్నారని, ప్రభుత్వం ధాన్యం సేకరణలో కచ్చితమైన ప్రణాళికతో ముందుకు సాగుతోందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నా రు. పెద్దపల్లి జిల్లా మంథని మార్కెట్‌ను శుక్రవారం మంత్రి సందర్శించారు. రైతులతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం మంత్రి శ్రీధర్‌బాబు మీడియాతో మాట్లాడారు. రైతులు అధైర్యపడవద్దని, ప్రతీధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ఇప్పటికే అధిక సంఖ్యలో పంట చేతికి వచ్చిందని, ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసిందని ఆయన అన్నారు. ప్రభుత్వ గోదాములు సరిపోకపోతే ప్రైవేట్‌ గోదాములు ఉపయోగిస్తామని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో వ్యవసాయం అంటే పండుగ అన్నారు. వరి పంట వేయకూడదనిలో సామాజిక మధ్యమాల్లో వస్తున్న వార్తలకు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. వాణిజ్య పంటలు పండించడం ద్వా రా రైతులకు అధిక లాభం వస్తుందని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారని చెప్పారు. మంథని మున్సిపల్‌ చైర్మన్‌ వొడ్నాల శ్రీనివాస్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కుడుదుల వెంకన్న, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్‌, మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement