● జీజీహెచ్ వైద్యులకు కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు
కోల్‌సిటీ(రామగుండం): సమయం ముసిగిందని బ్లడ్‌శాంపిళ్లు ఇచ్చేందుకు వచ్చే పేషెంట్లను వెనక్కి పంపించొద్దని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని కలెక్టర్ శుక్రవారం తనిఖీ చేశారు. వైద్య సేవలపై ఆరా తీశారు. డిప్యూటీ సూపరింటెండెంట్ అరుణ, ఆర్‌ఎంవోలు కృపాభాయి, రాజు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లలో కోతలు వద్దు
ెపద్దపల్లి: ధాన్యం కొనుగోళ్లలో కోతలు పెట్టొద్దని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించా రు. వివిధ అంశాలపై కలెక్టరేట్‌లో శుక్రవారం సమీక్షించారు. జూన్ 2వ తేదీ వరకు ధాన్యం కొనుగోళ్లు పూర్తిచేయాలని సూచించారు. ఉపాధిహామీ ద్వారా జిల్లాకు మంజూరైన నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ఆదేశించారు. జూన్ చివరివరకు పనుల గ్రౌండింగ్ పూర్తిచేయాలన్నారు. జిల్లాలో రోడ్డు భద్రత చర్యలు పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. విద్యాసంస్థలు, హాస్టళ్ల సమీపంలో పొగాకు విక్రయాలపై ప్రత్యేక తనిఖీలు చేయాలన్నారు. ఎన్టీసీపీ – కోప్టా చట్టం పటిష్టంగా అమలు చేయాలని కోరారు. అదనపు కలెక్టర్ అరుణశ్రీతోపాటు అధికారులు శ్రీమాల, శంకరయ్య, కాళిందిని, ప్రకాశ్, భావ్‌సింగ్, ప్రమోద్ కుమార్ పాల్గొన్నారు.
2 వరకు ఇందిరాశక్తి భవనం సిద్ధం
పెద్దపల్లిరూరల్: జిల్లాస్థాయి ఇందిరాశక్తి భవన నిర్మాణం పూర్తిచేసి జూన్ 2న రాష్ట ఆవిర్భావ వేడుకల వరకు సిద్ధం చేయాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. రాఘవాపూర్‌లోని భవన నిర్మాణం పనులను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో కాళిందిని, పంచాయతీరాజ్ ఈఈ శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.


