ఏపీపీగా కుమార్‌ | - | Sakshi
Sakshi News home page

ఏపీపీగా కుమార్‌

May 30 2026 8:53 AM | Updated on May 30 2026 8:53 AM

న్యూస్‌రీల్‌

మంథని: మంథని అడిషనల్‌ కోర్టు అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌(ఏపీపీ)గా ఆర్ధ కుమార్‌ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అంతర్గాం మండలం రా యదండి గ్రామానికి చెందిన కుమార్‌.. పరకా ల అడిషనల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో ఏపీపీగా పనిచేశారు. సాధారణ బదిలీల్లో భాగంగా పరకాల నుంచి మంథని కోర్టుకు ఆయన బదిలీపై వచ్చారు. కుమార్‌కు కోర్టు సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు.

వ్యర్థాల శుభ్రత ఇక సులభం

పెద్దపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో వ్యర్థాలను శు భ్రం చేయడం ఇకనుంచి మరింత సులభతరం కానున్నాయి. ఇందుకోసం ప్రభుత్వ హైస్కూ ళ్లకు ఇన్సినరేటర్‌ అందించనున్నారు. చెత్తను అధిక ఉష్ణోగ్రతలో కాల్చి సురక్షితంగా నిర్వర్తించే యంత్రమే ఇది. ముఖ్యంగా స్కూళ్లలో శా ని టరీ నాప్కిన్లు, పేపర్లు వంటి వ్యర్థాలను శు భ్రంగా నిర్వహించడానికి దోహదపడు తుంది. జిల్లాలో 2026– 27 విద్యా సంవత్సరంలో పా ఠశాలల ప్రారంభం రోజే దీనిని పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది.

Advertisement
 
Advertisement
Advertisement