పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల పాత్ర కీలకం | - | Sakshi
Sakshi News home page

పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల పాత్ర కీలకం

May 30 2026 8:53 AM | Updated on May 30 2026 8:53 AM

పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల పాత్ర కీలకం

గోదావరిఖని: నిందితులకు శిక్షపడే వి షయంలో పోలీసులతోపాటు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల పాత్ర కూడా కీలకమని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబ ర్‌ కిశోర్‌ ఝా అన్నారు. సీపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన స మావేశంలో మాట్లాడారు కేసుల విచారణలో నిందితులకు త్వరితగతిన శిక్షలు పడేలా పోలీసు అధికారులు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల మధ్య సమన్వయం మరింత బలోపేతం కావాలన్నారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు నుంచి చార్జ్‌షీట్‌ దాఖలు చేసేవరకూ పొరపాట్లు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీ సుకోవాలని సూచించారు. నిందితులకు శిక్షలు పడేలా చర్యలు చేపడితేనే బాధితుల కు నిజమైన న్యాయం దక్కుతుందని అన్నారు. అడిషనల్‌ డీసీపీ(అడ్మిన్‌) శ్రీనివాస్‌, సీసీఆర్‌బీ సీఐలు అనిల్‌కుమార్‌, బాబురావు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement