ప్రతిపక్షాల ఉచ్చులో చిక్కొద్దు | - | Sakshi
Sakshi News home page

ప్రతిపక్షాల ఉచ్చులో చిక్కొద్దు

May 29 2026 2:37 AM | Updated on May 29 2026 2:37 AM

సాక్షి పెద్దపల్లి:

ధాన్యం కొనుగోళ్లపై ప్రతిపక్షాలు చేసే రాజకీయాల్లో రైతులు చిక్కుకోవద్దని, దేశంలోనే రికార్డు స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం వరి, మొక్కజొన్నలు కొంటుందని పౌరసరఫరాల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రైతులకు సూచించారు. గురువారం జిల్లాలో పర్యటించిన మంత్రుల బృందం, మొదట పెద్దక ల్వల గ్రామంలోని కేంద్రంలో రెతులతో మాట్లా డారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని తెలుసుకున్నారు. అనంతరం కలెక్టరేట్‌లో నిర్వహించిన పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ఈ నెలాఖరులోపు ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని అధికారులు సూచించారు. అవసరమైతే ఇసుక, మైనింగ్‌ కార్యకలాపాలను తగ్గించి, ఆయా లారీలను సైతం ధాన్యం తరలించేందుకు వినియోగించుకోవాలని సూచించారు. వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కూడా ఎలాంటి కోతలు లేకుండా పూర్తి మద్దతు ధరతోనే కొనుగోలు చేసి బాయిలర్‌ మిల్లులకు తరలిస్తామని తెలిపారు. మిల్లర్లకు ఏవైనా నష్టాలు వచ్చినా ప్రభుత్వం భరిస్తుందని, రైతులకు మాత్రం నష్టం జరగనివ్వమన్నారు. ఆన్‌లైన్‌ ఎంట్రీలు, ట్రక్‌ షీట్‌ జనరేషన్‌, రైతుల చెల్లింపుల్లో పెద్దపల్లి జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉందని, ఇలాగే కొనసాగించాలని మంత్రి జిల్లాయంత్రాంగాన్ని అభినందించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర, పెద్దపల్లి, భూపాలపల్లి కలెక్టర్లు కోయ శ్రీహర్ష, రాహుల్‌ శర్మ, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌, ఆర్డీవోలు గంగయ్య, సురేశ్‌, సివిల్‌ సప్లయ్‌ డీఎం శ్రీకాంత్‌రెడ్డి, డీసీఎస్‌వో శ్రీనాథ్‌, జిల్లా సహకార అధికారి శ్రీమాల, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కాళిందిని, జిల్లా మార్కెటింగ్‌ అధికారి ప్రవీణ్‌రెడ్డి, సంబంధిత అధికారులు, రైస్‌ మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.

వర్షాలకు తడిసినా చివరి గింజ వరకు మద్దతు ధరతో కొనుగోలు చేస్తాం

ఇసుక లారీలను ధాన్యం రవాణాకు వినియోగించాలి

డిఫాల్ట్‌ రైస్‌ మిల్లులు బకాయిలు చెల్లిస్తే ధాన్యం కేటాయింపు

సమీక్ష సమావేశంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement