పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి బస్టాండ్ ఆవరణలో ప్రయాణికుల సౌకర్యార్థం విచారణ కేంద్రాన్ని ప్రారంభించి సెల్‌నంబరును అందుబాటులో కి తెచ్చారు. పెద్దపల్లి నుంచి ఇతర ప్రాంతాలకు బస్సుల్లో ప్రయాణించాలకునే వారు బస్సుల సమాచారాన్ని తెలుసుకునేందుకు 90631 56348 నంబర్‌కు కాల్ చేయాలని బస్‌స్టేషన్ మేనేజర్ రాంగోపాల్‌రెడ్డి తెలిపా రు. ఈ నంబరు రోజూ ఉదయం 6 నుంచి రా త్రి 9గంటల వరకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ అవకా శాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
‘రజకుల ఆత్మగౌరవంపై
ఎమ్మెల్యే పేరుతో దాడి’
పెద్దపల్లి: జిల్లాకేంద్రంలో రజకుల భూమి వద్ద ఎమ్మెల్యే విజయరమణారావును కీర్తిస్తూ విజ్జన్ననగర్ బోర్డు ఏర్పాటు చేయడం యావత్ రజక సమాజాన్ని అవమానించడమేనని రజక సంఘం జిల్లా అధ్యక్షుడు బొడ్డుపల్లి రమేశ్ అన్నారు. తెలంగాణ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ పేరు పెట్టాల్సింది పోయి, రాజకీయ నాయకుల పేర్లతో బోర్డులు పెట్టడాన్ని వ్యతిరేకించారు. ఎమ్మెల్యే మెప్పుకోసం కాంగ్రెస్ ముసుగులో ఉన్న రజకసంఘం నాయకుడు, తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం రజక జాతిని వాడుకోవడం సిగ్గుచేటన్నారు. ఎమ్మెల్యే భజన చేయాలనుకుంటే ఇతర మార్గాలను ఎన్నుకోవచ్చని, కానీ, రజకజాతి పేరును వాడుకునే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. రజక సమాజాన్ని తక్కువ అంచనా వేస్తే ఊరుకునేది లేదని, ఎమ్మెల్యే పేరుతో ఉన్న అనధికారిక బోర్డులను వెంటనే తొలగించి, ఐలమ్మ పేరుతో నామకరణం చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రజక సంఘం ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
మహాధర్నా జయప్రదం చేయండి
పెద్దపల్లి: గ్రామ పంచాయతీ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జూన్ 1న మండల కేంద్రాల్లో నిర్వహించే మహాధర్నా జయప్రదం చేయాలని గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ పిలుపునిచ్చింది. జిల్లా కేంద్రంలో గురువారం సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సీపెల్లి రవీందర్, ఎండీ ఖాజా మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లో ప్రజలకు సేవలందిస్తున్న పంచాయతీ కార్మికులపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వీడాలని డిమాండ్ చేశారు. జూన్ 1న జరిగే ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మండల అధ్యక్ష, కార్యదర్శులు దొంత కనుకయ్య, జంగంపల్లి నరేశ్, నాయకులు, ముస్తఫా, ప్రభాకర్, మల్లేశ్, పరశురాం, రాజేశం, శేఖర్, నాగరాజు, శంకర్, దేవేందర్, శ్రీధర్, సది, రమేశ్, శ్రీనివాస్, పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.
గ్రావిటీ వాటర్ ఫిల్టర్ ప్లాంట్ ప్రారంభించాలి
గోదావరిఖని(రామగుండం): గ్రావిటీ ఫిల్టర్ ఫ్లాంట్‌కు రూ.2కోట్లు విడుదల చేసి వెంటనే ప్రారంభించాలని సీఐటీయూ అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆర్జీ–1 ఏరియాలోని గ్రావిటీ వాటర్‌ఫిల్టర్ ప్లాంట్, ఫిల్టర్‌బెడ్‌ను పరిశీలించి మాట్లాడారు. కార్మిక కాలనీలకు స్వచ్ఛమైన నీరు సరఫరా కావడం లేదన్నారు. నల్లాల ద్వారా వచ్చే నీరు నీచు వాసన వస్తోందని, తాగేందుకు ఏమాత్రం అనుకూలంగా లేవన్నారు. ఫిల్టర్ బెడ్‌లో ఇంకో ఇంచు వరకు పాత ఇసుక తీసి కొత్త ఇసుక వేస్తే బాగుంటుందన్నారు. గ్రావిటీ ఫిల్టర్ బెడ్ నిర్మాణం చివరి దశలో ఉందని ఇంకో రూ.2 కోట్లు బడ్జెట్ కేటాయిస్తే సరిపోతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు ఆరెపల్లి రాజమౌళి, వంగల శివరామ్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, జెల్ల గజేంద్ర, అన్నబోయిన శంకర్, పెద్దపల్లి శశికిరణ్, ఈదుల సాగర్, విప్రవ్, జంగపల్లి మల్లేశ్, ఓద్నాల సాగర్, కొమ్మ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.


