పెద్దపల్లి: మార్కెట్‌కు మొక్కజొన్న తీసుకువస్తే బార్దాన్, సుతిలి రైతే కొనుక్కొని రావాలా అని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అధికారులను ప్రశ్నించారు. గురువారం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో తడిసిన వరి ధాన్యం, మొక్కజొన్నను పరిశీలించి మాట్లాడారు. రైతులు మార్కెట్లో ధాన్యం పోసి నెల రోజులుగా పడిగాపులు కాస్తున్నా కాంటా వేయరా అని అధికారులను నిలదీశారు. ఆరుగాలం కష్టపడి పంటపండించిన అన్నదాతలకు కాంగ్రెస్ హయాంలో అన్యాయమే జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి కాలయాపన చేయకుండా కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్‌కుమార్, మండల అధ్యక్షుడు మార్కు లక్ష్మణ్, నాయకులు వెన్నం రవీందర్, సలేంద్ర రాములుయాదవ్, పెంచాల శ్రీధర్, రేవెల్లి స్వామి, మేకల కుమార్‌యాదవ్, ముత్యాల రాజయ్య, జుబేర్, పల్లె మధు, వైద శ్రీనివాస్, గండు రంగయ్య, లవన్ కుమార్, నుగిళ్ళ వీరేశం, బొడ్డుపల్లి రమేశ్, కుక్క మనోజ్‌కుమార్, రమేశ్, వేణుగోపాలరావు, తీగల సదయ్య, కారుపాకల సంపత్, ధర్మపురి, నర్ల అంజయ్య, చిట్టవేన వినీత్, బి.లింగయ్య, తోటపల్లి సంపత్ కుమార్ పాల్గొన్నారు.


