గోదావరిఖని(రామగుండం): సింగరేణి బొగ్గు నిల్వ లపై సీబీఐ విచారణ జరపాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మా దాసి రామ్మూర్తి డిమాండ్ చేశారు. గురువారం రా మగుండం రీజియన్‌లోని పలు బొగ్గు గనులపై ఉ న్న బొగ్గు నిల్వలను టీబీజీకేఎస్ బృందం పరిశీలించింది. యాజమాన్యం ప్రకటించిన విధంగా బొగ్గు నిల్వలు లేవని, కోల్ డంపింగ్ యార్డ్ ఖాళీగా కనబడుతోందన్నారు. జీడీకే–5 ఓసీపీలో అత్యధికంగా బొగ్గు నిలువలు ఉన్నాయని యాజమాన్యం పేర్కొన్నప్పటికీ, సందర్శించడానికి మాత్రం అనుమతించలేదన్నారు. బొగ్గు నిల్వచేసే ప్రాంతాల్లో షేల్ బొగ్గు, బండలు, కాలిపోయిన బొగ్గు బూడిద మాత్రమే దర్శనమిస్తున్నాయని, రామగుండం రీజియన్‌లో బొగ్గు నిల్వలు లేవని తమ పరిశీలనలోనూ తేలిందన్నారు. బొగ్గు నిల్వలపై యాజమాన్యం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు పోలాడి శ్రీనివాసరావు, వడ్డేపల్లి శంకర్ తదితరులు ఉన్నారు.


