మధ్యవర్తులకు చోటులేదు | - | Sakshi
Sakshi News home page

మధ్యవర్తులకు చోటులేదు

May 28 2026 2:10 AM | Updated on May 28 2026 2:10 AM

పెద్దపల్లి: తహసీల్దార్‌ కార్యాలయాల్లో మధ్యవర్తులకు చోటులేదని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష స్ప ష్టం చేిశారు. సుల్తానాబాద్‌లోని బాలసదనం, వృద్ధాశ్రమం, తహసీల్దార్‌ కార్యాలయాలను కలెక్టర్‌ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈనెల 29న ప్రభుత్వ విప్‌ విజయరమణారావుతో బాలసదనం ప్రారంభిస్తామని, ఏర్పాట్లు పూర్తిచేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. వృద్ధులకు అసౌకర్యం కలగకుండా సేవలు అందించాలని సూచించారు. అధికారులు వేణుగోపాల్‌, బషీరోద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

వేడుకలకు పటిష్ట ఏర్పాట్లు

పెద్దపల్లి: తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు అ న్నిఏర్పాట్లు చేయాలని ఆర్డీవో గంగయ్య ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లపై అధికారులతో బుధవారం సమీక్షించారు. కలెక్టరేట్‌లో వేడుకలు జరుగుతాయని తెలిపారు. ఈ సమావేశంలో ఏసీపీ కృష్ణ, కలెక్టరేట్‌ పరిపాలన అధికారి ప్రకాశ్‌, సీ– విభాగం సూపరింటెండెంట్‌ కుమారస్వామి, మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్‌, తహసీల్దార్‌ రాజయ్య పాల్గొన్నారు.

చిన్నారులకు క్రీడల్లో శిక్షణ

జ్యోతినగర్‌: ఎన్టీపీసీ పర్మినెంట్‌ టౌన్‌షిప్‌లోని చిన్నారులకు క్రీడల్లో శిక్షణ ఇవనున్నట్లు ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ చందన్‌కుమార్‌ సామంత అన్నారు. మంగళవారం రాత్రి జ్యోతిక ర్రి యేషన్‌ క్లబ్‌లో వేసవి ప్రత్యేక క్రీడాపోటీల శిక్ష ణ శిబిరం ప్రారంభించి మాట్లాడారు. వేసవి సె లవుల్లో క్రీడల్లో ప్రావీణ్యం పొందాలని సూచించారు. శిక్షణ శిబిరం జూన్‌ 8వ తేదీ వరకు కొనసాగనున్నట్లు ఆయన పేర్కొన్నారు, దీప్తి మహి ళా సమితి అధ్యక్షురాలు రాఖీ సామంత, ఏజీ ఎం సాగర్‌ రంజన్‌ సాహూ, క్లబ్‌ సెక్రటరీ రంజిత్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

నేడు సింగరేణీ సీఎండీ రాక

గోదావరిఖని: సింగరేణి సీఎండీ బుద్ధ ప్రకాశ్‌జ్యోతి గురువారం రామగుండం ప్రాంతంలో పర్యటించనున్నారు. సీఎండీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈప్రాంతంలో పర్యటించడం ఇదే తొలిసారి. ఆయన పర్యటన నేపథ్యంలో రామగుండం రీజియన్‌లోని నాలుగు ఏరియాల్లో అధికారులు అప్రమత్తమైయ్యారు. పర్యటన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

పొగాకు ఉత్పత్తులు వాడొద్దు

పెద్దపల్లి: పొగాకు ఉత్పత్తులు వాడొద్దని జిల్లా వైద్యాధికారి ప్రమోద్‌కుమార్‌ సూచించారు. జి ల్లాకేంద్రంలోని ఐటీఐలో బుధవారం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం నిర్వహించారు. పొగా కు ఉత్పత్తులు.. వినియోగం .. పొగపీల్చడం ద్వారా కలిగే దుష్ప్రభావలపై అవగాహన క ల్పించారు. పొగాకుతో క్యాన్సర్‌, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని తె లిపారు. ప్రోగ్రాం అధికారులు రాజమౌళి, ర వీంద్రారెడ్డి, సిబ్బంది మధుసూదన్‌ ఉన్నారు.

దరఖాస్తులు ఆహ్వానం

పెద్దపల్లి: ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్‌ కోసం జూలై 31వ తేదీ లోగా దరఖాస్తు చేయాలని జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్‌రావు తెలిపారు. ఆవిష్కరణ, సృజనాత్మక, సామాజిక సేవ, పర్యావరణం, క్రీడలు, కళలు, సంస్కృతి, సైన్స్‌, టెక్నాలజీ తదితర రంగాల్లో ప్రతిభ చూపిన 18ఏళ్ల వయసు లోపు బాల, బాలికలు అర్హులన్నారు. ఆసక్తిగలవారు http://awards.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు 99666 76181 నంబరులో సంప్రదించాలని కోరారు.

ఇబ్బంది లేకుండా అండర్‌ బ్రిడ్జి మరమ్మతు

ఓదెల: ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఓదెల రైల్వేస్టేషన్‌ సమీపంలోని అండర్‌ బ్రిడ్జి మరమ్మతులు చేపట్టామని దక్షిణ మధ్య రైల్వే ఏడీఎన్‌ శ్రీవాస్తవ, ఐవోడబ్ల్యూ లోకేశ్‌ కుమార్‌ అన్నారు. ఓదెల అండర్‌బ్రిడ్జి మరమ్మతులను వారు పరిశీలించారు. త్వరితగతిగా మరమ్మతులు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. సర్పంచ్‌ సతీశ్‌తోపాటు పంచాయతీ కార్యదర్శి వెంకటలక్ష్మణ్‌గౌడ్‌, నాయకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement