పెద్దపల్లిరూరల్: రైతులు కష్టపడి పండించిన పంట లు కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. రైతుగోస–బీజేపీ భరోసా పేరిట బీ జేపీ ప్రజాప్రనిధులు చేపట్టిన బస్సుయాత్ర బుధవారం పెద్దపల్లి మార్కెట్‌కు చేరింది. మహేశ్వర్‌రెడ్డితోపాటు ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి, రామారావు పటేల్, రాకేశ్‌రెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్, ఎ మ్మెల్సీలు మల్క కొమురయ్య, అంజిరెడ్డి తదితరు లు స్థానిక మార్కెట్‌ను సందర్శించారు. రైతుల స మస్యలపై ఆరా తీశారు. రైతు కష్టాన్ని మార్కెట్‌లో రకరకాలుగా దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. తూకంలో జాప్యం చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని, ఇలాంటి వాళ్ల సంగతి తేలుస్తామన్నారు. మార్కెట్ లో నెలరోజులుగా పడిగాపులు పడుతున్నా కొనుగోళ్లలో వేగం పెంచకపోవడమేంటని ప్రశ్నించారు. బీజేపీ ప్రజాప్రతినిధుల బృందం మార్కెట్‌కు వ స్తుందని తెలిసి మంగళవారం అర్ధరాత్రి దాకా పొ రుగు రాష్ట్ర కూలీలతో పనులు చేయించి పెద్దఎత్తున ధాన్యాన్ని మిల్లులు, గోదాములకు తరలించడం సంతోషకరమేనన్నారు. ఈ పని ఇప్పటికే చేస్తే రైతులు ఇంతగోస పడేవారుకాదని అన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి దుగ్యాల ప్రదీప్‌కుమార్, నాయకులు జి.సురేశ్‌రెడ్డి, సంధ్యారాణి తదితరులు ఉన్నారు.
రైతులపై అక్రమ కేసుల చరిత్ర కాంగ్రెస్‌దే
మంథనిరూరల్: దేశానికి అన్నం పెట్టే రైతులపై అక్రమ కేసులు పెట్టిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని బీజేపీ తెలంగాణ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ధ్వజమెత్తారు. రైతు గోస–బీజేపీ భరోసా యాత్ర బుధవారం గుంజపడుగుకు చేరింది. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీలు ఈటెల రాజేందర్, రఘనందన్‌రావుతో కలిసి ఆయన సందర్శించారు. మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ, రైతులు పండించిన పంటను అమ్ముకోవడం కోసం అష్టకష్టాలు పడుతున్నారని, యాత్రలో తాము వస్తుంటే దారి వెంట కన్నీరు పెట్టుకుంటున్నారన్నారు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్‌పై ఉన్న శ్రద్ధ రైతుల కష్టాలు తీర్చడంలో సీఎం రేవంత్‌రెడ్డికి లేదన్నారు. రెండురోజుల క్రితం కాటారంలో ధాన్యం కొనుగోలు చేయాలని ఆందోళన చేసిన రైతులపై అక్రమ కేసులు పెట్టించారని, ఓ వృద్ధుడు చెప్పుతో కొట్టుకుంటే అతడి ఇంటిపై దాడి చేశారని, ఆ కుటుంబాన్ని పరామర్శించామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చందుపట్ల సునీల్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చల్లా నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, మాజీ జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి, పార్టీ మండల అధ్యక్షుడు వీరబోయిన రాజేందర్, పట్టణ అధ్యక్షుడు సబ్బని సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్‌రెడ్డి
పెద్దపల్లి మార్కెట్‌లో ధాన్యం, మక్కల కొనుగోళ్లు పరిశీలన


