మంథనిరూరల్: చెత్తా చెదారం లేకుండా నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశించిన క్రమంలో జిల్లాలోని పలువురు అన్నదాత లు శుభ్రతపై ఆసక్తి చూపుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ప్యాడీ క్లీనర్‌లు అందుబాటులో ఉంచినా కూలీలతో వడ్లు శుభ్రం చేయించే పనిలో నిమగ్నమవుతున్నారు. కేంద్రాల్లో ప్యాడీక్లీనర్‌ల నిర్వహణకు సదుపాయాలు లేకపోవడంతో రైతులు కూలీ చెల్లించి మరీ తూర్పార పట్టిస్తున్నారు. అయితే మధ్యా హ్నం సమయంలో వేడి గాలులు రావడంతోఉదయంపూటనే గాలి వస్తేనే తూర్పార పట్టుకుంటున్నామని పలువురు రైతులు తెలిపారు.
ప్రతి కేంద్రంలో ప్యాడీ క్లీనర్..
జిల్లాలో ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 334 కొనుగోలు కేంద్రాలకు ప్యాడీ క్లీనర్‌లను అందజేశారు. గతంలో మాన్యువల్ ప్యాడీ క్లీనర్‌లు ఉండగా తాజాగా ఆటోమెటిక్ ప్యాడీ క్లీనర్‌లను అందుబాటులోకి తీసుకువచ్చారు. అయితే వీటికి విద్యుత్ కనెక్షన్‌లు రైతులే ఏర్పాటు చేసుకోవాల్సి ఉండగా అందుకు రైతులు ఆసక్తి చూపడం లేదు. దూరప్రాంతం నుంచి వైర్‌లను లాగి అమర్చుకోవ డం కష్టంగా మారుతుందని రైతులు చెబుతున్నారు.
గాలొస్తుంటే తూర్పార...
ప్రస్తుతం వేసవికాలం కావడంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వడగాలులు వీస్తుంంటాయి. ఈ సమయంలో రైతులు కల్లాల్లోకి వెళ్లి తమ వరి ధాన్యం తూర్పార పట్టుకుంటున్నారు. రెండు, మూ డు ఎకరాల్లో పంట సాగు చేసిన సన్నకారు రైతులు ప్యాడీ క్లీనర్‌లను ఉపయోగించుకునేందుకు ముందుకు రావడం లేదు. తమ పంటను తామే శుభ్రం చేసుకుంటున్నామని చెబుతుంటే మరికొంత మంది రైతులు పాత పదతిలో వడ్లలోంచి తాలు పోయేలా కూలీలతో చాటేయిస్తున్నామని తెలిపారు.
ట్రాక్టర్ లోడ్ వడ్లకు రూ.600 కై కికి
కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన పంటను శుభ్రం చేసేందుకు సైతం కూలీల సేవలు వాడుకుంటున్నారు. ఒక ట్రాక్టర్ లోడ్ వడ్లను శుభ్రం చేసేందుకు రూ.600 వరకు కూకిలి(కూలి) తీసుకుంటున్నారని రైతులు చెబుతున్నారు. వడ్లలోంచి తాలు పోయేలా తూర్పార పట్టడం మొదలు.. కుప్పలోంచి చెత్తాచెదారం పోయేలా చాటేయడం వరకు కూలీలకే అప్పగిస్తున్నారు. వేసవికాలం కావడం వడగాలులు వస్తుండటంతో ఉదయం పూటనే ఈ పనులు చేస్తున్నట్లు రైతులు చెబుతున్నారు.
ట్రాక్టర్ లోడ్‌కు రూ.600 కూలి
శుభ్రం చేసినవడ్లు విక్రయించేందుకు రైతుల ఆసక్తి
కేంద్రాల్లో అలంకారప్రాయంగా ప్యాడీ క్లీనర్‌లు
కూలీలతోనే చాటేయిస్తున్న అన్నదాతలు


