తడిసిన ధాన్యం కొంటాం | - | Sakshi
Sakshi News home page

తడిసిన ధాన్యం కొంటాం

May 28 2026 2:10 AM | Updated on May 28 2026 2:10 AM

పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్‌: వర్షాలతో తడిసిన, రంగుమారిన ధాన్యం కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన పడొద్దని ప్రభుత్వ విప్‌ విజయరమణారావు అన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. జి ల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం అధికారులతో ధాన్యం సేకరణపై సమీక్షించారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు 80 శా తం వరకు ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయని అధికారులు తెలుపగా.. మిగతా ధాన్యాన్ని త్వరగా తూ కం వేయించి కొనుగోళ్ల ప్రక్రియ పూర్తిచేయాలని విప్‌ సూచించారు. రైస్‌మిల్లర్లు కొర్రీలు పెట్టకుండా సహకరించాలని, లారీ యజమానుల సంఘం కూ డా తమవంతు సహకారం అందించాలని కోరారు. పౌర సరఫరాల డీఎం శ్రీకాంత్‌రెడ్డి, డీఎస్‌వో శ్రీనాథ్‌, రైస్‌మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం రవాణాలో వేగం పెంచాలి

కాల్వశ్రీరాంపూర్‌: ధాన్యం తూకం, లారీల్లో లోడింగ్‌, మిల్లుల్లో అన్‌లోడింగ్‌ ప్రక్రియలు వేగవంతం చే యాలని, మొక్కజొన్నలను గోదాముల్లోకి తరలించాలని ప్రభుత్వ విప్‌ విజయరమణారావు కోరారు. కాల్వశ్రీరాంపూర్‌లో రైతులు ట్రాక్టర్లను రోడ్డపై నిలి పి మంగళవారం నిరసన తెలుపగా.. విప్‌ బుధవా రం వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించారు. మాజీ ఎంపీపీ సారయ్యగౌడ్‌, ఏఎంసీ చైర్మన్‌ రామిడి తిరుపతిరెడ్డి, సర్పంచ్‌ బంగారి రమేశ్‌, సింగిల్‌విండో చైర్మన్‌ చదువు రాంచంద్రారెడ్డి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు గాజనవేన సదయ్య, మార్కెట్‌ డైరెక్టర్‌ రవి, మాజీ సర్పంచ్‌ మాదాసు సతీశ్‌, నాయకుడు కలువల శ్యాంగౌడ్‌, రైతులు పాల్గొన్నారు.

నేడు జిల్లాకు మంత్రుల రాక

పెద్దపల్లి: పౌరసరఫరాల మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రె డ్డి, ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు గురువారం పెద్దకల్వ ల, అప్పన్నపేటలోని కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్ల తీరు పరిశీలిస్తారని, తర్వాత కలెక్టరేట్‌లో సమీక్షిస్తారని విప్‌ విజయరమణారావు తెలిపారు.

అన్నదాతలు ఆందోళన పడొద్దు

ప్రభుత్వ విప్‌ విజయరమణారావు

Advertisement
 
Advertisement
Advertisement