కోల్‌సిటీ(రామగుండం): రామగుండం నగరంలో హరిత హోటల్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ అన్నారు. నివాసయోగ్యమైన నగరంగా, విద్యా, ఉపాధి కేంద్రం మార్చడానికి కృషి చేస్తున్నామన్నారు. రూ.4.18 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు, మేయర్ మహంకాళి స్వామితో కలిసి బుధవారం గోదావరిఖని టీచర్స్ కాలనీలో ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ప్రతీ వీధిలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిధులు సమకూరుస్తుమన్నారు. నిధుల కొరతతో నిలిచిన కోర్టు భవన నిర్మాణాన్ని పూర్తి చేయిస్తామని ఆయన అభయం ఇచ్చా రు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని సూచించారు. కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను అంగుళం కూడా తగ్గకుండా స్వాధీనం చేసుకోవాలని సూచించారు. మేయర్ మహంకాళి స్వామి మాట్లాడారు. కార్యక్రమంలో డిప్యూటీ మే యర్ పాతపెల్లి ఎల్లయ్య, అదనపు కలెక్టర్ అరుణ శ్రీ, కార్పొరేటర్లు రేణికుంట్ల నిర్మల, సాగి సంతోష్‌రావు, వెంగళ బాపు, బాలసాని తిరుపతి, దాసరి సాంబమూర్తి, బదావత్ నర్సమ్మ, భాగ్యలక్ష్మి, సత్య ప్రసాద్, ఎస్‌ఈ గురువీర తదితరులు పాల్గొన్నారు.
కార్యకర్తలకు అండగా ఉంటాం
జ్యోతినగర్: కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కష్టపడే ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటానని రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ అన్నారు. స్థానిక ఎన్టీపీసీ టీటీఎస్‌లో ఏర్పాటు చేసిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రామగుండం నియోజకవర్గ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని ఆమర తెలిపారు. మేయర్ మహంకాళి స్వామి, నాయకులు బొంతల రాజేశ్, కాల్వ లింగస్వామి, దీటి బాలరాజు, ముస్తఫా, అసిఫ్ పాషా, పెండ్యాల మహేశ్, పీక అరుణ్ కుమార్, గుండేటి రాజేష్‌శ్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్


