మార్కెట్‌కు ధాన్యం తెచ్చి 20 రోజులైంది. నాలుగు రోజుల కింద సంచుల్లో నింపిండ్రు. తూకం వేస్తలేరు. కాంటా పెట్టి మిల్లుకు పంపిచాలని అడిగితే రేపు, మాపు అంటున్నరు. వానకు ధాన్యం తడిసింది. మళ్ల కింద పోసి ఆరబెట్టినం. మా గోస పట్టించుకునేదెవరు?
– మామిడి లక్ష్మి, పెద్దపల్లి
పట్టించుకునేటోళ్లేలేరు
ఏప్రిల్ 18న మార్కెట్‌లో ధాన్యం కుప్పగా పోసిన. అధికారులు, సిబ్బంది రోజూ తిరుగుతున్న. నన్ను ఎవలు పట్టించుకుంటలేరు. నా పక్క కుప్ప ఆసామి ఫోన్‌పే ద్వారా రూ.2వేలు పంపంగనే తూకం అయింది. ఇదేందని అడిగితే.. ఎవలకు చెప్పుకున్నా ఏంకాదంటున్నరు. ఇట్లా జేసేత మేం ఏం చేయాలె? – పొలం రమేశ్, చందపల్లి
పైసలిస్తేనే సంచులిస్తరట
వడ్లను అమ్ముకుందామని నెలకింద మార్కెట్‌కు తెచ్చి న. నా తర్వాత వచ్చినోళ్లు పైసలిస్తే తూకం వేసి ఇళ్లకు పంపిండ్రు. ఇదేమని అడిగితే పైసలిస్తేనే తొందరగా తూకం అయితదంటున్నరు. గిదెక్కడి న్యాయం?
– బొంకూరి అశోక్, పెద్దపల్లి
అన్ని నేనే సమకూర్చుకున్న
మక్కలకు మద్దతు ధర వస్తదని నెల కింద మార్కెట్‌ల పోసిన. తూకం అయితలేదు. మంగళవారం వాన పడ్డది. ఇంకా వానలు ఉన్నయంటున్నరు. అందుకే గన్నీ సంచులు, సుతిలితోపాటు హమాలీలను బయటినుంచి తీసుకొచ్చి తూకం వేయించిన. రూ.3వేలు పెట్టి ట్రాక్టర్ కిరాయికి తెచ్చి గోదాం తరలించుకున్న. – వెంకట్రామిరెడ్డి, కొత్తపల్లి


