ప్రాణాలు కాపాడేది గోల్డెన్‌ అవర్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రాణాలు కాపాడేది గోల్డెన్‌ అవర్‌

May 28 2026 2:10 AM | Updated on May 28 2026 2:10 AM

కోల్‌సిటీ(రామగుండం): ప్రమాదం జరిగిన గంటలోపు(గోల్డెన్‌ అవర్‌) చికిత్స అందితే ప్రాణాలు ద క్కుతాయని గోదావరిఖని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి(జీజీహెచ్‌) ఎమర్జెన్సీ విభాగం ఫిజీషియన్‌ స్వర్ణలత, వైద్య బృందం మనోహర్‌, మహేశ్‌, కిరణ్‌, సౌ మ్య వెల్లడించారు. ‘వరల్డ్‌ ఎమర్జెన్సీ మెడిసిన్‌ డే’ సందర్భంగా బుధవారం జీజీహెచ్‌లో వైద్య, సి బ్బంది, పేషెంట్లు, బంధువులకు అవగాహన క ల్పించారు. రోడ్డు ప్రమాదాలు, గుండెపోటు, విష ప్రయోగాలు, కాలినగాయాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో తొలి గంటను ‘గోల్డెన్‌ అవర్‌’గా పరిగణిస్తారని, ఈ సమయంలో సరైన వైద్యం అందితే ప్రాణాపాయం తప్పుందని అన్నారు. గాయపడిన వ్యక్తిని అనవసరంగా కదిలించకూడదని, వెంటనే 108కు సమాచారం ఇవ్వాలని, రక్తస్రావం ఉంటే శుభ్రమైన గుడ్డతో ఒత్తిడి చేయాలని, గుండెపోటు లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలని

డాక్టర్‌ స్వర్ణలత వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement