ఆర్‌ఎఫ్‌సీఎల్‌ బాధితులకు న్యాయం చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఆర్‌ఎఫ్‌సీఎల్‌ బాధితులకు న్యాయం చేయాలి

May 27 2026 12:59 AM | Updated on May 27 2026 12:59 AM

గోదావరిఖని: ఆర్‌ఎఫ్‌సీఎల్‌ బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ నాయకులు మంగళవారం ఆందోళన నిర్వహించారు. కార్మిక సంఘం నాయకులు అంబటి నరేశ్‌ ఆధ్వర్యంలో స్థానిక ప్రధాన చౌరస్తా నుంచి ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీస్‌ ముట్టడికోసం ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. విషయం తెలుసుకున్న గోదావరిఖని వన్‌టౌన్‌ సీఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించి వారిని అడ్డుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. దీనికి ముందు స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నరేశ్‌ మాట్లాడారు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌ కార్మికుల నుంచి వసూలు చేసిన డబ్బులతో కొనుగోలు చేసిన భూమి డీటీసీపీ లేఅవుట్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు భూమి సీజ్‌చేసి బాధితులకు న్యాయం చేయాలన్నారు. బాధితుల మొదటి విడత 100మంది లిస్ట్‌ తయారు చేశామని, మొత్తం 400మంది బాధితులు ఉన్నారని, ఒక్కొక్కరికి సుమారు రూ.4లక్షల వరకు రావాల్సి ఉందన్నారు. బాధితులకు పరిహారం అందించకపోతే రిలే నిరాహార దీక్ష చేపడతామన్నారు. నాయకులు రమేశ్‌, పూర్ణచందర్‌, సతీశ్‌, క్రాంతి, ప్రశాంత్‌, శ్రావణ్‌, రమేశ్‌, శ్రీకాంత్‌, రాంకీ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement