మస్టర్లు తక్కువుంటే వేటే | - | Sakshi
Sakshi News home page

మస్టర్లు తక్కువుంటే వేటే

May 27 2026 12:59 AM | Updated on May 27 2026 12:59 AM

గోదావరిఖని: అసలే ఉద్యోగాలు దొరక్క యువత ఇబ్బంది పడుతుంటే.. దొరికిన జాబ్‌కు ఎగనామం పెడుతూ ఉద్యోగాన్ని పీకల మీదకు తెచ్చుకుంటున్నారు సింగరేణి కార్మికులు. ఏడాదిలోగా వంద మస్టర్ల లోపుంటే యాజమాన్యం చర్యలకు సిద్ధమైంది. గతంలో ఏరియాల వారీగా ఉన్న చర్యలు ఇప్పుడు సింగరేణి అంతా ఒకే విధానానికి తీసుకవచ్చారు.

యువ ఉద్యోగులే ఎక్కువ

సంస్థ వ్యాప్తంగా సుమారు 39వేల మంది కార్మికులు పనిచేస్తుండగా, సుమారు 16వేల మందికి పైగా యువ కార్మికులు ఉద్యోగాలు చేస్తున్నారు. మెడికల్‌ ఇన్వాలిడేషన్‌ ద్వారా పెద్ద సంఖ్యలో యువ విద్యాధిక కార్మికులు విధుల్లో చేరారు. చాలా మంది సాఫ్ట్‌వేర్‌, ఎంబీఏ, ఎంబీబీఎస్‌ ఉద్యోగాలు వదిలిపెట్టుకుని సింగరేణిలో జాయిన్‌ అయ్యారు. వీరికి సంక్షేమం, సౌకర్యాలు కల్పిస్తున్నా కార్మికులు డ్యూటీల కు రాకపోవడం సంస్థపై ప్రతికూల ప్రభావం చూ పుతోందని యాజమాన్యం గమనించింది. గైర్హాజరవుతున్న కార్మికుల్లో యువ ఉద్యోగులే ఎక్కువగా ఉంటున్నారని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.

తగ్గించుకోని వ్యాపకాలు

సింగరేణి ఉద్యోగాల్లో చేరుతున్న యువత పాత వ్యాపకాలు వదులుకోవడం లేదని తెలుస్తోంది. చాలా మంది సాఫ్ట్‌వేర్‌, పాత వ్యాపారాలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా యాజమాన్యం గుర్తించింది. ఈక్రమంలో డ్యూటీలకు ఎగనామం పెట్టి గత వ్యాపకాల వైపు దృష్టిపెట్టడంతో గైర్హాజర్‌ పెరుగుతున్నట్లుగా చెబుతున్నారు.

సింగరేణి యాజమాన్యం సీరియస్‌

సంస్థవ్యాప్తంగా సుమారు 1600మందికి పైగా గైర్హాజరవుతున్నట్లు యాజమాన్యం జాబితా తయారు చేసింది. వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డైరెక్టర్‌(పా) అన్ని ఏరియాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సర్క్యులర్‌ ప్రకారం మొదటి వంద మస్టర్ల లోపుంటే రెండు ఇంక్రిమెంట్లు కట్‌, రెండో ఏడాది కూడా అలానే ఉంటే లోయర్‌ గ్రేడ్‌లోకి రివర్షన్‌, మూడో ఏడాది వందకన్నా తక్కువ ఉంటే ఉద్యోగంలోంచి తీసెయ్యమని ఆదేశాలు రావడంతో ఏరియా వారీగా అధికారులు చర్యలు చేపట్టారు.

ఏడాదిలో వంద మస్టర్ల లోపు ఉంటే చర్యలు

సస్పెండ్‌, చార్జిషీట్‌, రివర్షన్‌, డిస్మిస్‌

Advertisement
 
Advertisement
Advertisement