మత సామరస్యంతో బక్రీద్‌ జరుపుకోవాలి | - | Sakshi
Sakshi News home page

మత సామరస్యంతో బక్రీద్‌ జరుపుకోవాలి

May 27 2026 12:59 AM | Updated on May 27 2026 12:59 AM

కోల్‌సిటీ(రామగుండం): బక్రీద్‌ పండుగను మత సామరస్యంతో శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని రామగుండం మేయర్‌ మహంకాళి స్వా మి అన్నారు. మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో బక్రీద్‌ పండుగ ఏర్పాట్లపై వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, కార్పొరేటర్లు, ము స్లిం మత పెద్దలతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో మాట్లాడారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రూ.12లక్షలు వెచ్చించి ఈద్గాల వద్ద టెంట్లు, తాగునీరు, మైక్‌ తదితర సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. పశువధ విషయంలో ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్‌ జె.అరుణశ్రీ, డిప్యూటీ మేయర్‌ ఎల్లయ్య, ఏసీపీ రమేశ్‌, పశువైద్యాధికారి ప్రసాద్‌, సీఐలు ఇంద్రసేనారెడ్డి, ప్రసాదరా వు, రాజేశ్వర్‌రావు, పలువురు కార్పొరేటర్లు, ముస్లిం మత పెద్దలు, నగరపాలక సంస్థ, ఎన్‌టీపీసీ, సింగరేణి, ఆర్‌ఎఫ్‌సీఎల్‌ అధికారులు పాల్గొన్నారు.

మొక్కజొన్న రైతుల ఆందోళన

కాల్వశ్రీరాంపూర్‌: కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తిప్పలు పెడుతున్నారని ఓపిక నశించిన మొక్కజొన్న రైతులు మంగళవారం ఆగ్రహంతో రహదారి పై ట్రాక్టర్లను అడ్డుగా పెట్టి ఆందోళనకు దిగారు. ఓదెల మండలం పొత్కపల్లిలో డీసీఎంఎస్‌ ఆధ్వర్వంలో కొనుగోలు చేసిన మొక్కజొన్నలను సోమవారం కాల్వశ్రీరాంపూర్‌ వ్యవసాయ మార్కెట్‌ డీసీఎంఎస్‌ గోదాంలో అన్‌లోడ్‌ చేసుకోవాలని పంపించారు. ఈరోజు అన్‌లోడ్‌ కాదని మంగళవారం దించుకుంటామని ఇన్‌చార్జి అనడంతో రైతులు ఓపికతో వేచి ఉన్నారు. తీరా మంగళవారం ఇక్కడ గో దాంలో ఖాళీ లేదని అన్‌లోడ్‌ చేసుకోలేమని తిరస్కరించారు. మంథని, పెద్దపల్లి, సుల్తానాబాద్‌, మద్ది కుంటకి తీసుకువెళ్లండంటూ ఇన్‌చార్జి పేర్కొనడంతో ఆగ్రహించిన రైతులు కాల్వశ్రీరాంపూర్‌లో మొ క్కజొన్నల లోడ్‌తో ఉన్న ట్రాక్టర్లను రోడ్డుకు అడ్డంగా పెట్టి ఆందోళనకు దిగారు. రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో ఎస్సై వెంకటేశ్‌ చేరుకొని ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి రైతులను సముదాయించి శాంతింప జేశారు.

Advertisement
 
Advertisement
Advertisement