పెట్రో ధరలు తగ్గించాలి | - | Sakshi
Sakshi News home page

పెట్రో ధరలు తగ్గించాలి

May 27 2026 12:59 AM | Updated on May 27 2026 12:59 AM

ధర్మారం: కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్‌, డీజి ల్‌ ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ ధర్మారం మండల కేంద్రంలో మంగళవారం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్‌కుమార్‌ ధర్నాలో పాల్గొని మాట్లాడుతూ పెట్రోల్‌ ఉత్పత్తుల పెరుగుదలతో సామాన్యులపై మోయలేని భారం పడుతు ందన్నారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు నోరు ఉందని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే తీవ్ర పరిణా మాలు ఉంటాయని, ప్రజల కోసం పనిచేస్తున్న తన పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని తెలిపారు. గత ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగిన ఈశ్వర్‌ సంక్షేమానికి ఒక్క వసతి గృహం నిర్మించలేదని ఆ రోపించారు. తాను చేస్తున్న అభివృద్ధి పనులను ఓర్వలేక తనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారన్నా రు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి డిప్యూటీ తహసీల్దార్‌ ఉదయ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రూప్లానాయక్‌, వైస్‌ చైర్మన్‌ లింగయ్య, లక్ష్మీనర్సింహస్వామి ఆలయ కమిటీ చైర్మన్‌ సంతోశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement