పెద్దపల్లిరూరల్: ఇటుక తయారీకి అవసరమయ్యే ముడిసరుకులో ఒకటైన చెరువుమట్టిని ఇటుక బట్టీ ప్రాంతానికి తరలించేందు కు అధికారుల నుంచి బట్టీ యజమానులు అనుమతులు పొందినా.. దారి పొడవునా ఉన్న ఊళ్ల ప్రజలు, నాయకుల నుంచి అడ్డగింతలు తప్పడం లేదు. చెరువులో పూడికతీత తీ యడం వల్ల చెరువులో నీటిమట్టం పెరిగి భూగర్భజలాలు పెంపొందుతాయని అధికారులు, ప్రజాప్రతినిధులు చెబుతున్నా.. చెరువుమట్టి టిప్పర్‌కు రూ.3200కే ఇవ్వడం చాలా చౌక అని, బహిరంగ మార్కెట్‌లో టిప్పర్‌కు రూ.10నుంచి 12వేలదాకా ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. అదీ కాక టిప్పర్‌లో ఓవర్‌లోడ్ మట్టితో తమ గ్రామాల మీదుగా రాకపోకలు సాగించడం వల్ల రోడ్లు, వంతెనలు దెబ్బతింటున్నాయంటూ గ్రామాల్లో అడ్డగిస్తున్నా రు. సుల్తానాబాద్ మండలం కొదురుపాక నుంచి వచ్చే టిప్పర్లను నిట్టూరు గ్రామస్తులు అడ్డుకుని రో డ్డుపై మంచాలు వేసుకుని బైఠాయించారు. మంగళవారం పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌లో మట్టిటిప్పర్లను అడ్డుకోగా పోలీసులు జోక్యం చేసుకొని ఇబ్బందులుంటే చర్చించి పరిష్కరించుకోవాలని సూచించడంతో వెనుదిరిగారు. ప్రభుత్వం నుంచి అనుమతులు పొందినా అనధికారిక ఖర్చులు తమకు భారంగా పరిణమిస్తున్నాయని పలువురు బట్టీయజమానులు పేర్కొంటున్నారు.
మట్టి తరలింపులో తిప్పలు


