రైతులను ఇబ్బందికి గురిచేస్తే సహించం | - | Sakshi
Sakshi News home page

రైతులను ఇబ్బందికి గురిచేస్తే సహించం

May 27 2026 12:59 AM | Updated on May 27 2026 12:59 AM

పాలకుర్తి: ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బందికి గురిచేస్తే సహించమని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ అన్నారు. మంగళవారం పాలకుర్తి మండలం జీడీనగర్‌ గ్రామపంచాయతీ పరిధిలోని గణపతి ఇండస్ట్రీస్‌ రైస్‌మిల్లును తనిఖీ చేసి ధాన్యం నిల్వలను పరిశీలించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మిల్లర్లు సహకరించాలని, తాలు, తేమ పేరుతో రైతులను ఇబ్బంది పెడితే చర్యలుంటాయని హెచ్చరించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన ప్రతీ ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందన్నారు. ఈ విషయంలో రైతులు ఎవరూ అధైర్యపడొద్దని సూచించారు. మండలంలో 40వేల మెట్రిక్‌ టన్నుల గోదాముల నిర్మాణం చేపట్టి ఇబ్బందులకు లేకుండా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే వెంట జీడీనగర్‌ సర్పంచ్‌ సూర రమ, మాజీ ఎంపీపీ రమేశ్‌, డీసీసీ ప్రధాన కార్యదర్శి సూర సమ్మయ్య, పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌, తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement