పెద్దపల్లిరూరల్/పెద్దపల్లి: వే బిల్లులు లేకుండా చె రువు మట్టిని ఇటుక బట్టీలకు తరలిస్తున్న ఆరు టి ప్పర్లను అధికార కాంగ్రెస్ నాయకుడు బొంకూరి అవినాష్, కౌన్సిలర్ నాంసాని శ్రీనివాస్ తదితరులు సోమవారం అడ్డుకున్నారు. తహసీల్దార్ రాజయ్య కు ఫిర్యాదు చేయగా.. డిప్యూటీ తహసీల్దార్ విజేందర్ ఎల్లమ్మగుడి ప్రాంతంలో ఆపిన టిప్పర్లను తని ఖీ చేశారు. సుల్తానాబాద్ మండలం కొదురుపాక చె రువు నుంచి మట్టి తరలిస్తున్న 21 టిప్పర్లు నిలిచి ఉండగా అందులో 15 టిప్పర్లకు వేబిల్లులు ఉన్నాయని, వాటిని వదిలేశారు. మిగతా ఆరు టిప్పర్లలో చెరువుమట్టి అక్రమంగా తరలిస్తున్నారని నిర్ధారించి సీజ్ చేసినట్లు డిప్యూటీ తహసీల్దార్ తెలిపారు.
అవినీతికి ఆస్కారం లేదు
ప్రభుత్వ విప్ విజయరమణారావు సారథ్యంలో నీతివంతమైన పాలన సాగుతోందని యూత్‌కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బొంకూరి అవినాష్ అన్నారు. నిబంధనలు పాటించకుండా చెరువు మట్టి తరలిస్తున్న టిప్పర్లను తామే పట్టుకుని అధికారులకు అప్పగించి సీజ్ చేయించడమే ఇందుకు నిదర్శనమన్నారు. మాజీ ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ఆయన మద్దతుదారులు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యేపై నిందారోపణలకు దిగడం సరికాదని ఆయన పేర్కొన్నారు.


