కోల్‌సిటీ(రామగుండం): రో హిణీ కార్తె సో మవారం ప్రా రంభమైంది. ఇదేసమయంలో ఎండలు తీ వ్రస్థాయికి చేరా యి. ఉదయం నుంచే మండి పోయిన సూ ర్యుడు మధ్యాహ్నానికి నిప్పు లు కక్కుతూ ప్ర జల్ని ఉక్కిరిబిక్కిరి చేశాడు. వడగాలులు, ఉక్కపోత, భానుడి భగభగలకు నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లపై వేడిసెగలు ఎగసిపడుతుండగా, ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. ఎండల నుంచి ఉపశమనం కోసం కొందరు గొడుగులు పట్టుకొని బయటకు వచ్చారు. ఇంకొందరు తలకు రుమాలు, కర్చీఫ్‌లు చుట్టుకొని ప్రయాణించారు. మహిళలు చీర కొంగులతో తలపై, ముఖాలను కప్పుకొని ఎండను తట్టుకునే ప్ర యత్నం చేశారు. మధ్యాహ్న వేళల్లో ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారగా, చల్లని పానీయాల దుకాణాలు జనంతో కిక్కిరిశాయి.


