ఈ నెల 7న కేంద్రానికి వడ్లు తెచ్చిన. మాయిశ్చర్ వచ్చింది. కాంటా పెట్టడం లేదు. నాలుగురోజుల కింద మహారాష్ట్ర నుంచి వడ్లు తీసుకువచ్చి మా ఊరి కేంద్రం నుంచి పంపించారట. వడ్లు తాలు ఉన్నయని రైస్‌మిల్లులో అన్‌లోడ్ చేయలేదు. దీంతో లారీలు సెంటర్‌కు రావడం లేదు. రోజూ రెండు లారీలు వచ్చేవి. ఇప్పుడు రెండు రోజుకో లారీ వస్తుంది. తొమ్మిది రోజుల నుంచి కాంటా పెడతారని ఎదురుచూస్తున్న.
– బోసిక శంకర్, రైతు, మల్లేపల్లి, మంథని
విచారణ జరుగుతోంది
బినామీ రైతుల పేరుతో రైస్ మిల్లుకు ధాన్యం తరలించిన ఘటనపై విచారణ జరుగుతోంది. విజిలెన్స్ విచారణలో దోషులుగా తేలిన వారిపై చర్యలు ఉంటాయి. సొసైటీకి చెందిన వారు ఉన్నా చర్యలు తీసుకుంటాం.
– శ్రీమాల, జిల్లా సహకార అధికారి, పెద్దపల్లి


